Site icon NTV Telugu

Pawankalyan : వీరమల్లుకు కొత్త చిక్కులు.. వాళ్లతో పోటీ తప్పదా..?

Hhvm

Hhvm

Pawankalyan : ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎట్టకేలకే హరిహర వీరమల్లుకు గుమ్మడికాయ కొట్టేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ కొంత ఖుషీ అవుతున్నా.. రిలీజ్ డేట్ పైనే అనుమానాలు మొదలయ్యాయి. మే 9కి రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించినా.. చివరకు దాన్ని క్యాన్సిల్ చేసేశారు. షూటింగ్ పూర్తి అయింది కాబట్టి ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నారు. కానీ వరుసగా పెద్ద సినిమాలు డేట్స్ లాక్ చేసుకుని కూర్చున్నాయి. మే 30న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ ఉంది. దానిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవేళ పవన్ అదే డేట్ కు రావాలని చూస్తే కింగ్ డమ్ ను వాయిదా వేసే ఛాన్స్ ఉంది.
Read Also : Samantha: ఇంకా ఏదో చేయాలనే ఉండేది.. ‘ట్రాలాలా’ వెనుక కథ ఇదే!

ఆలోగా మిగతా పనులన్నీ కంప్లీట్ కావాలి. ఒకవేళ పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అయితే జూన్ మొదటి వారానికి షిఫ్ట్ కావాలి. కానీ అప్పుడు థగ్ లైఫ్ తో కమల్ హాసన్ వస్తున్నాడు. తెలుగులో ఇబ్బంది లేకున్నా.. తమిళంలో వీరమల్లుకు చిక్కులే. పోనీ జూన్ మధ్యలో రిలీజ్ చేసినా కన్నప్ప, కుబేర సినిమాలు ఉన్నాయి. ఇవి కూడా మంచి హైప్ తో వస్తున్న పాన్ ఇండియా సినిమాలే. జులై నెల ఖాళీగానే ఉంది. ఆగస్టులో మళ్లీ వార్-2, కూలీ సినిమాలు ఉన్నాయి. అవి చాలా పెద్ద సినిమాలు.

కాబట్టి పవన్ కల్యాణ్‌ జూన్ లో దిగాలి. లేదంటే జులైలో పోటీ లేకుండా రావాలి. జూన్ లో వస్తే మాత్రం థగ్ లైఫ్‌ తో పాటు కన్నప్ప, కుబేర సినిమాలతో పోటీ పడాలి. అవి గనక హిట్ టాక్స్ తెచ్చుకుంటే వీరమల్లు కలెక్షన్లపై దెబ్బ పడుతుంది. చాలా గ్యాప్ తర్వాత పవన్ నుంచి వస్తున్న మూవీ కాబట్టి కలెక్షన్లు తగ్గొద్దని పవన్ ఫ్యాన్స్ పట్టుబడుతున్నారు. ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి నెల రోజుల్లోపు మూవీని రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది. ఈ లెక్కన ఎటు చూసుకున్నా హరిహర వీరమల్లు సినిమాకు పోటీ తప్పేలా కనిపించట్లేదు. ఒకవేళ ముందుగా ప్రకటించినట్టే మే 9కే వస్తే పెద్ద మూవీలు లేవు కాబట్టి మంచి లాభాలు కనిపించేవి. షూట్ ఆలస్యం మూవీకి పోటీని పెంచేసింది. చూడాలి మరి వీరమల్లు ఎవరితో పోటీ పడుతాడో.
Read Also : Mock Drill: హైదరాబాద్‌లో రేపు మాక్ డ్రిల్.. సైరన్ మోగగానే ప్రజలు ఏం చేయాలో తెలుసా?

Exit mobile version