Site icon NTV Telugu

Hanuman: హనుమాన్ థియేటర్ల అంశం.. మోనోపోలీ అంటూ నిర్మాత కీలక వ్యాఖ్యలు!

Hanuman

Hanuman

Hanuman Producer Niranjan Reddy about Theatres allocation: తేజ సజ్జ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. మేకర్స్ మాగ్నమ్ ఓపస్ అని చెబుతున్న ఈ సినిమా టీజర్, పాటలు, ట్రైలర్ కి వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమాను శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. హను-మాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర నిర్మాత కె నిరంజన్ రెడ్డి విలేకరుల సమావేశంలో హనుమాన్ విశేషాలు పంచుకున్నారు.

Aishwarya Ragupathi: ధనుష్ ఈవెంట్ లో నటి ప్రైవేట్ పార్ట్ తాకిన పోకిరి.. వీడియో వైరల్

హనుమాన్ బజ్ కి తగ్గ థియేటర్లు దొరకడం లేదని వినిపిస్తుంది కదా అని అడిగితే దానికి ఆయన మాట్లాడుతూ ఈ సినిమా చిత్రం కోసం దాదాపు మూడేళ్ళ పాటు కష్టపడ్డాం. మేము విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందన్నారు. ఇక ప్రేక్షకులు సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని, ఆడియన్స్ కూడా సంక్రాంతి మా సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడాలని కోరుకుంటున్నారని, దానికి తగినట్లు హనుమాన్ ని స్పెషల్ ఫిల్మ్ గా కన్సిడర్ చేసి సపోర్ట్ ఇవ్వండి అనేది మా కోరిక అని అన్నారు. నాలుగు సినిమాలు వస్తున్నపుడు స్కేల్, బజ్ కి తగ్గట్టు సినిమాకి థియేటర్స్ కేటాయింపు ఇవ్వాలనేదే మా విన్నపం అని అన్నారు. అంతేకాక 76 దియేటర్లకు 70 తీసుకుంటే దానిని మోనోపోలీ అంటారా? లేక డిస్క్రిమినేషన్ అంటారా? మీరే చెప్పాలని అన్నారు. చాలా మంది థియేటర్ల ఓనర్లు మేము హను-మాన్ వెయ్యాలని అనుకుంటున్నాం… కాకపోతే వెయ్యనివ్వడం లేదు అంటున్నారని పేర్కొన్నారు. మేము మొత్తం మాకే కావాలని అనడం లేదు, మా సినిమాకు తగట్టు హైదరాబాద్ లో ఒక 15-20 థియేటర్స్ ఇవ్వండి అంటున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version