Hanuman Crosses 150 Crores Gross Collections Worldwide: యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా అనేక వండర్స్ క్రియేట్ చేస్తోంది. తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా ఈ సినిమాని చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు. అయితే సినిమా గ్రాఫిక్స్ కి ఎక్కువ కాలం పట్టడంతో రిలీజ్ వాయిదా వేస్తూ చివరికి ఈ ఏడాది సంక్రాంతికి జనవరి 12వ తేదీన రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత మొదటి ఆట నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ తో పాటు డివోషనల్ కంటెంట్ ఉందనే విషయం బాగా ప్రేక్షకుల్లోకి వెళ్లడంతో ఈ రోజుకి సైతం టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. మొదటి వారం పూర్తి కావడంతో ఇప్పుడు గుంటూరు కారం సహా ఇతర సినిమాలకు థియేటర్లు ఇచ్చిన వారు సైతం హనుమాన్ సినిమా ప్రదర్శించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ సినిమా మొదటి వారం రోజులకు గాను 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసినట్లు కొద్దిసేపటి క్రితమే సినిమా టీం ప్రకటించింది.
Bigg Boss Sivaji: ఆ పార్టీలోకి వెళ్తా.. అందరి దూల తీర్చేస్తా
ఒక కుర్ర హీరో సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ సినిమాకి 150 కోట్ల వరకు గ్రాస్ వచ్చిందంటే 70 నుంచి 80 వరకు షేర్ కలెక్షన్స్ కూడా వచ్చినట్టే. కాబట్టి 100 కోట్లు షేర్ కలక్ట్ చేయడం పెద్ద విషయమేమీ కాదని అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు. ఎందుకంటే ఈ వారం కూడా ఒక్క తెలుగు సినిమాకు థియేటర్లలో రిలీజ్ అవడం లేదు. దానికి తోడు గుంటూరు కారం సహా మిగతా రెండు సినిమాలు ఇచ్చిన ధియేటర్లు కూడా హనుమాన్ కి యాడ్ కావడంతో ఆ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక నార్త్ అమెరికాలో కూడా ఒక అరుదైన రికార్డు సృష్టించింది. ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి టాప్ సిక్స్త్ గ్రాసర్ గా నిల్చింది. అల వైకుంఠపురంలో సినిమాకి కొద్దిగా వెనకబడి ఉండడంతో ఆ రికార్డు కూడా బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు. అదే చేస్తే టాప్ ఫిఫ్త్ ప్లేస్ కి హనుమాన్ చేరుకుంటుంది.
