Hansika Motwani: దేశముదురు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బబ్లీ బ్యూటీ హన్సిక ఈ మధ్యనే సోహైల్ ను పెళ్ళాడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తన స్నేహితురాలి భర్తనే ఏరికోరి వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వారి విడాకులకు తాను కారణం కాదని చెప్పి విమర్శలకు చెక్ పెట్టింది. తన పెళ్లి విషయాలను పంచుకుంటూ హన్సిక లవ్ షాదీ డ్రామా పేరుతో ఒక సిరీస్ నే నడిపించేస్తోంది. ఇందులో తన ఇష్టాలు, అపోహలు, కెరీర్ లో ఎదుర్కున్న అనుమానాలు, అవమానాలు అన్నింటిని పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది. వయస్సు పెరగడానికి ఇంజక్షన్స్ తీసుకోలేదని బల్లగుద్ది చెప్పిన హన్సిక మొట్ట మొదటిసారి తన మొదటి లవ్ స్టోరీ గురించి బ్రేకప్ గురించి నోరు విప్పింది. కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో హన్సిక ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. వీరి ఘాటైన ప్రేమ ఫొటోలతో సహా బయటపడింది. ఇక కొన్ని కారణాల వలన ఈ జంట విడిపోయారు. బ్రేకప్ తరువాత హన్సిక, శింబుతో కలిసి నటించింది కానీ, ఏనాడు వారి బ్రేకప్ గురించి నోరు విప్పింది లేదు. ఇక తాజాగా ఈఇంటర్వ్యూలో శింబుతో బ్రేకప్ గురించి మాట్లాడింది.
Nandamuri Tarakaratna: అశ్రునయనాల మధ్య తారకరత్న అంత్యక్రియలు పూర్తి
“నేను ప్రేమను నమ్ముతాను.. కానీ ఒక శృంగార పురుషుడిని అయితే కాదు. ఒకసారి బ్రేకప్ అయ్యాకా.. మరొక వ్యక్తిని నమ్మడానికి నాకు ఎనిమిదేళ్లు పట్టింది. నేను అంత ఈజీగా ఎవరితోనూ ఎమోషన్స్ పంచుకోను. నా గత ప్రేమ్ జీవితం ఎంతో విచిత్రంగా నడిచింది. దాని నుంచి బయటపడడానికి నాకు ఎనిమిదేళ్లు పట్టింది. నాకు నచ్చిన వ్యక్తిని, నాతో కలకాలం ఉండే వ్యక్తితో ఆ ఎమోషన్స్ పంచుకొని జీవించడానికి ఆ టైమ్ తీసుకున్నా మంచి నిర్ణయమే తీసుకున్నాను అని అనుకుంటున్నాను.నా పాట రిలేషన్స్ గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడను. అదంతా ముగిసిపోయిన జీవితం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.