NTV Telugu Site icon

Hansika Motwani: ‘స్కిన్ మాఫియా’ అనే కొత్త భయాన్ని పుట్టించే ‘మై నేమ్ ఈజ్ శృతి’

Hansika Motwani Exclusive Intervew

Hansika Motwani Exclusive Intervew

Hansika Motwani Exclusive Web Interview for My Name is Shruthi: దేశ‌ముదురు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా మారిన హ‌న్సిక అన‌తికాలంలోనే స్టార్ హీరోయిన్ అయింది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఆమె హీరోయిన్ గా న‌టిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మై నేమ్ ఈజ్ శృతి’. శ్రీ‌నివాస్ ఓంకార్ దర్శకత్వంలో వైష్ణ‌వి ఆర్ట్స్ ప‌తాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించగా నవంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సందర్భంగా.. హీరోయిన్ హన్సిక మీడియాతో సినిమా విశేషాలను పంచుకుంది.

ఈ క్రమంలో హన్సిక మాట్లాడుతూ.. ‘‘థ్రిల్లర్‌ చిత్రాలను చాలా ఎంజాయ్‌ చేస్తున్నా, స్కిన్ మాఫియా ముప్పును స్పృశించే డార్క్ థ్రిల్లర్ సినిమా ఇది. ఈ నేపథ్యంలో సినిమా చేయడం ఇదే తొలిసారి, నా పాత్ర ఇందులో ఓ ట్రాప్‌లో పడుతుంది. నా పాత్ర పేరు శృతి, యాడ్ ఏజెన్సీలో పనిచేస్తోంది. ఆమె ఒక సారి పోలీసులకు అనూహ్య పరిస్థితుల్లో చిక్కుతుంది. ఈ క్రమంలో తనకు తానుగా బెయిల్ తెచ్చుకుంటుందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. శృతి ఒక పోరాట యోధురాలు, ఆమెకు ఆత్మవిశ్వాసం ఎక్కువ, దేనికీ వెనకడుగు వేయదు, ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుంటూ వెళ్తుందని, అలాంటి శృతికి ఓ భయంకరమైన, అధిగమించలేదని సమస్య ఎదురవుతుంది? దాని నుండి శృతి ఎలా బయటపడింది అనేదే ఈ చిత్ర కాన్సెప్ట్ అని అన్నారు.

మా అమ్మ డెర్మటాలజిస్ట్, ఈ సినిమా చేసే క్రమంలో నిజంగా స్కిన్ మాఫియా ఉందా? అని అమ్మను అడిగా, తను కూడా ఎక్కడో ఇలాంటి ఘటన జరిగినట్లు చదివానని చెప్పింది. ఈ మాఫియా ద్వారా సామాన్యుడి జీవితంలో చీకటి వ్యాపిస్తుంది, ఈ సినిమా కోసం దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ పరిశోధన చేస్తున్న సమయంలో కొన్ని అనుకోని సంఘటనలు ఫేస్ చేశారు. ఇటువంటి సున్నితమైన అంశాన్ని టచ్ చేస్తూ.. సినిమా చేయడం సవాళ్లతో కూడుకున్న అంశం. ఊహించని ట్విస్ట్‌లతో.. చూస్తున్న ప్రతి ఒక్కరికీ థ్రిల్ ఇస్తుందీ సినిమా, ఇలాంటి థ్రిల్లర్ స్పేస్‌లో భాగమైనందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్ అవుట్‌పుట్‌తో చూసి చాలా హ్యాపీ, సాంకేతికంగానూ ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. మార్క్ కె రాబిన్‌ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా ఉంటుంది. ఈ ఫ్యామిలీ, ఫ్రెండ్లీ థ్రిల్లర్ ప్రతి కుటుంబాన్ని కదిలిస్తూ కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది.

ప్రస్తుతం తమిళ చిత్రాలతో చాలా బిజీగా ఉన్నా, అందుకే నా తెలుగు ఫిల్మోగ్రఫీలో కొంత గ్యాప్ వచ్చింది. నా కెరీర్‌ విషయంలో ఎప్పుడూ బాధపడలేదు, అవకాశాలు ఉన్నా, లేకున్నా.. నేనిప్పుడు అలాగే ఉన్నాను. నటన పరంగా మాత్రం నేనింకా సంతృప్తి చెందలేదనే చెబుతా, ఇంకా ఎన్నో గొప్ప పాత్రలు చేయాలని ఉంది. నా కెరీర్‌ ప్రారంభంలో అల్లు అర్జున్‌, ప్రభాస్‌తో కలిసి పనిచేసినందుకు నేను గర్వపడుతున్నా, వారి సినిమాలిప్పుడు సరిహద్దులను చెరిపేస్తూ పాన్ ఇండియా రేంజ్‌కి చేరుకున్నాయి. వారి కష్టానికి ఆ గుర్తింపు అర్హమైనదని నేను భావిస్తా, ఎంత పెద్ద స్టార్స్ అయినప్పటికీ.. ఎప్పటిలాగే వినయంగా ఉండటం వారి గొప్పతనానికి నిదర్శనం. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ థియేటర్‌లో చూసి.. మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుతున్నా, ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చడమే కాదు.. ఆలోచింపజేస్తుందని మాత్రం కాన్ఫిడెంట్‌గా చెప్పగలను..’’ అని అన్నారు.