ఇండస్ట్రీలో ఊహించని జంటలు వారి బందాలకు ముగింపు పలుకుతున్నారు. రెండు మూడేళ్లు ప్రేమించుకుని.. పెళ్లి చేసుకున్న తర్వాత కనీసం ఏడాది కూడా కలిసి ఉండటం లేదు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో హీరోయిన్ కూడా చేరింది. ఆమె ఎవరో కాదు హన్సిక. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె విడాకులపై ఊహాగానాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. 2022 డిసెంబర్‌లో తన బిజినెస్ పార్ట్‌నర్ సోహైల్ కథూరియాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వెడ్డింగ్ డెస్టినేషన్ వేడుకలు చాలా గ్రాండ్‌గా జరిగాయి. ఈ వివాహాన్ని ‘Love Shaadi Drama’ పేరుతో ఓ డాక్యుమెంటరీ సిరీస్‌గా ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. అప్పట్లో ఇది ట్రెండింగ్‌లో దూసుకెళ్లింది.
Also Read : Nayanthara : అతని కోసం సర్వం త్యాగం చేసిన నయన్.. వైరల్ అవుతున్న పాత స్టోరీ !
అలాంటిది కొన్ని రోజులుగా ఈ జంట విడిగా ఉంటున్నారు అనే వార్తలు వినిపించాయి. సోహైల్ ఈ రూమర్లను ఖండించినా, హన్సిక మాత్రం ఈ విషయం పై ఇప్పటివరకు ఏ ఒక్క ప్రకటన ఇవ్వలేదు. ఇప్పుడు ఆమె తన సోషల్ మీడియా నుంచి పెళ్లికి సంబంధించిన ఫొటోలన్నీ తొలగించడంతో విడాకుల రూమర్స్‌కు మళ్లీ ఊపొచ్చింది. చాలా వరకు ఈ మధ్య ఫోన్ స్టెటస్ లేదా స్టోరీ ద్యాకా ఎదుటి మనిషి బాధలో ఉన్నారా లేక హ్యాపిగా ఉన్నారా అనే మూడ్‌ను ఒక నిర్ణయిస్తున్నారు ఇలాంటి టైంలో..
హన్సిక ఇలా మ్యారెజ్ ఫోటోలు డిలీట్ చేయడంతో విడాకుల వార్తలు మరింత గట్టిగా మారుమ్రోగుతున్నాయి. వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదురవుతున్నా, హన్సిక ప్రొఫెషనల్‌గా మాత్రం బిజీగా కొనసాగుతున్నారు. ఇటీవల ‘గార్డియన్’ అనే హారర్ చిత్రంలో నటించిన హన్సిక, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ‘శ్రీ గాంధారి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి హన్సిక పెళ్లి జీవితం మళ్లీ మలుపు తిరుగుతుందా? లేక ఇవన్నీ కేవలం గాసిప్సేనా? అన్నది చూడాలి. కానీ ప్రస్తుతం ఆమె ఇన్‌స్టా యాక్షన్ ఈ చర్చలకు మరింత బలం చేకూర్చింది మాత్రం ఫిక్స్.
