Justin Bieber : కాన్సర్ట్ లో కాల్పుల కలకలం… గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాపులర్ హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కాన్సర్ట్ బయట కాల్పుల కలకలం రేగింది. ఫిబ్రవరి 11, శుక్రవారం రాత్రి లాస్ ఏంజిల్స్‌లో సెలబ్రిటీ ప్యాక్ పార్టీ వెలుపల ముగ్గురు వ్యక్తులు కాల్పులకు గురయ్యారు. ఈవెంట్‌ను నిర్వహిస్తున్న ది నైస్ గై అనే రెస్టారెంట్ బయట కొంతమంది వ్యక్తుల మధ్య ఘర్షణ చెలరేగడంతో గన్ ఫైర్ జరిగినట్టు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తూ ఈ కాల్పుల్లో ఎవరూ చనిపోలేదు. కానీ బుల్లెట్లు తగిలి రాపర్ కోడాక్ బ్లాక్‌తో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడినట్టు సమాచారం. వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రస్తుతం ఆ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also : Rakul Pic : రెడ్ బికినీలో రచ్చ… సెగలు రేపుతున్న బ్యూటీ
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
రాపర్ కొడాక్ బ్లాక్ అసలు పేరు బిల్ కప్రీ. ఈ ఘటనలో నిందితుల గురించి ఎలాంటి సమాచారం లేదని, విచారణ జరుపుతున్నామని అక్కడి అధికారులు తెలిపారు. పసిఫిక్ డిజైన్ సెంటర్‌లో మునుపటి ప్రీ-సూపర్ బౌల్ ప్రదర్శన అనంతరం లాస్ ఏంజెల్స్ హాట్‌స్పాట్‌లో తాజాగా జస్టిన్ స్టార్-స్టడెడ్ రివాల్వ్ ఆఫ్టర్ పార్టీని నిర్వహించాడు. డ్రేక్, లియో డికాప్రియో, టోబే మాగైర్, కెండల్ జెన్నర్, ఖోలే కర్దాషియాన్ ఈ ఆఫ్టర్ పార్టీకి హాజరయ్యారు. అయితే బయటకొచ్చిన వీడియో ప్రకారం కొడాక్ బ్లాక్, గున్నా, లిల్ బేబీ మధ్యాహ్నం 2:45 గంటలకు రెస్టారెంట్ బయట నిలబడి ఉన్నారు. అకస్మాత్తుగా కొంతమంది మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. అంతలోనే కాల్పులు జరిగాయి. ఆయా కాల్పుల్లో ఈ ముగ్గురూ గాయపడ్డారు.
శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఈవెంట్‌లో బీబర్ దాదాపు 30 నిమిషాల ప్రదర్శన ఇచ్చాడు. ముఖ్యంగా షాన్ మెండిస్, ఆంథోనీ రామోస్, లోగాన్ పాల్, నియాల్ హొరాన్, స్కూటర్ బ్రౌన్‌లతో ఈ కార్యక్రమం అర్ధరాత్రి ముగిసింది. 1,500 మంది ప్రేక్షకులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!