Site icon NTV Telugu

‘డియర్‌ మేఘా’ గుండెల్లో కన్నీటి మేఘం.. లిరికల్ వీడియో

మేఘా ఆకాశ్‌, అదిత్‌ అరుణ్‌, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డియర్‌ మేఘా’. సుశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వేదాంశ్ క్రియేటివ్ వర్క్ బ్యానర్‌పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఫీల్‌గుడ్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడలో ‘దియా’ పేరుతో మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘గుండెల్లో కన్నీటి మేఘం.. కమ్మిందా తానైతే దూరం’ అంటూ సాగే ఈ పాట హృదయాన్ని తాకేలా ఉంది. హరి గౌర సంగీతం అందించగా.. కృష్ణకాంత్ సాహిత్యానికి హరిణి గానం ఆలపించారు. ‘లై’, ‘ఛల్ మోహన్‌రంగా’, ‘తూటా’ తదితర సినిమాల్లో నటించిన మేఘా ఆకాశ్‌ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకొంది.

Exit mobile version