NTV Telugu Site icon

Naga Chaitanya-Shobhita: పెళ్లి పనులు సరే.. పెళ్ళెప్పుడు?

Naga Chaitanya Sobhitha

Naga Chaitanya Sobhitha

గత కొద్ది రోజులుగా నాగచైతన్య శోభిత వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ముందు సమంత ప్రేమించే వివాహం చేసుకున్న నాగచైతన్య ఆమె నుంచి పరస్పర విడాకులు తీసుకున్నారు. తర్వాత నాగచైతన్య శోభితతో డేట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ చివరి నిమిషం వరకు సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ఎంగేజ్మెంట్ రోజున ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని అనౌన్స్ చేశారు. మొత్తానికి వాళ్లు పెద్దలను ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత శోభిత నిన్న పసుపు దంచడం మొదలుపెట్టినట్లు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో అసలు వీరి పెళ్లెప్పుడు జరుగుతుంది అనే విషయం మీద చర్చలు మొదలయ్యాయి. అయితే నాగచైత,న్య శోభిత పెళ్లి ఇప్పట్లో లేదని డిసెంబర్ నెలలో మీరు వివాహం చేసుకోబోతున్నారని దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Jagapathi Babu: ఎంత ఎదవలాగా చేస్తే అన్ని అవార్డులు.. జగపతిబాబు సంచలనం

అయితే ఇది సంప్రదాయ బద్ధంగా అందరి మధ్యలో చేసుకునే వివాహమా లేక కేవలం సన్నిహితులు మంచి చేసుకునే డెస్టినేషన్ వెడ్డింగా అనే విషయం ఇప్పటివరకు క్లారిటీ లేదు. నాగచైతన్య, శోభిత ఇద్దరూ తమ వివాహానికి సంబంధించిన విషయాలను చాలా సీక్రెట్ గా ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి నాగచైతన్య తండేల్ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాని సంక్రాంతికి కాకుండా ముందే రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తండేల్ షూట్ పూర్తి చేసిన తర్వాతే వివాహానికి సిద్ధమవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు అని కూడా ఒక ప్రచారం ఉంది. ఇక వివాహానికి సంబంధించి వీరు అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ఆ డేట్ ని అనౌన్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే చాలామంది పెళ్లి పనులు మొదలు పెట్టేసారు కాబట్టి ఒక వారం రోజుల్లోపే వీరు వివాహం జరగబోతోంది అని భావిస్తున్నారు కానీ అది నిజం కాదు డిసెంబర్ నెలలోనే వీరి వివాహం ఉండే అవకాశం ఉందంటున్నారు.

Show comments