NTV Telugu Site icon

Devara : సినిమా లో జాన్వీ పాత్ర ఎలా ఉండబోతుందో తెలుసా..?

Whatsapp Image 2023 06 12 At 3.55.32 Pm

Whatsapp Image 2023 06 12 At 3.55.32 Pm

ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. RRR సినిమా ఎన్టీఆర్ రేంజ్‌ను భారీగా పెంచేసింది అని చెప్పాలి.
అదే ఎనర్జీ తో ఇప్పుడు ఎన్టీఆర్ తన 30వ చిత్రం ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్‌ లో స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌ లోనే కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోందని సమాచారం.. దీంతో ఈ మూవీపై భారీ గా అంచనాలు ఏర్పడ్డాయి.అందుకు తగ్గట్లుగా నే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

కోస్టల్ బ్యాక్ డ్రాప్‌ తో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘దేవర’ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చి నెలలోనే మొదలు పెట్టిన విషయం తెలిసిందే.. ఆ వెంటనే దీనికి సంబంధించిన రెండు భారీ యాక్షన్ షెడ్యూళ్లను కూడా ఎంతో విజయవంతం గా పూర్తి చేసినట్లు సమాచారం.. ఈ క్రమంలోనే ఇప్పుడు మూడో షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఈ తాజా షెడ్యూల్‌లో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూడా భాగం అవుతారని సమాచారం.. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.

‘దేవర’ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె మత్స్యకార కుటుంబానికి చెందిన యువతిగా కనిపించబోతుందని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అలాగే ఆమె అండర్ కవర్ ఆఫీసర్‌గా కూడా నటిస్తుందని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి.. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్‌కు సవతి కూతురిగా జాన్వీ కపూర్ పాత్ర ఉండబోతుందని సమాచారం.. ఈ విషయం సినిమాలో సస్పెన్స్‌గా ఉంటుందని తెలుస్తుంది.అంతేకాదు, ఇది రివీల్ అయినప్పుడు ప్రేక్షకులంతా కూడా ఆశ్చర్యపోవడం ఖాయం అని తెలుస్తుంది.

Show comments