Site icon NTV Telugu

Pushpa Teaser: అది సార్ నా బ్రాండ్.. ఏకంగా గూగుల్ తల్లే సలాం కొట్టిందిగా!!

Allu Arjun Google

Allu Arjun Google

Google India responds on Allu Arjun’s Pushpa The Rule Teaser: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించిన టీజర్ ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ది రైజ్ అనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు ఆయనకు నార్త్ లో కూడా ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సీక్వెల్ ప్లాన్ చేశారు మేకర్స్. వాస్తవానికి సినిమా హిట్ కాకపోతే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ హిట్ కావడమే కాదు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఆ అంచనాలను పెంచే విధంగా సినిమా యూనిట్ ఎప్పటికప్పుడు ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తూ వస్తోంది.

Allu Arjun – Trivikram : అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా కన్ఫార్మ్.. పోస్టర్ లుక్ అదిరిందిగా..

అందులో భాగంగానే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్నపాటి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆ టీజర్ అంత ఆసక్తికరంగా లేదని కొంతమంది అంటుంటే ఈ మాత్రం చాలు ఇంకెందుకు ధియేటర్లకు పరుగులు పెట్టడానికి అంటూ అల్లు అర్జున్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సంగతి అలా ఉంచితే ఈ టీజర్ గురించి ఏకంగా గూగుల్ సంస్థ తమ సోషల్ మీడియా వేదికగా స్పందించడం హాట్ టాపిక్ అయింది. సాధారణంగా గూగుల్ సంస్థ చిన్న విషయాల మీద లేదా ఇలాంటి సినిమాల విషయం మీద స్పందించదు. కానీ ఎందుకో ఏమో తెలియదు కానీ పుష్ప టీజర్ బ్యాక్ డ్రాప్ లో ఉండగా తగ్గేదేలే అనే పదాన్ని ఇంగ్లీషులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నట్లుగా గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ చేసి దేర్ ఇస్ నో లెటింగ్ డౌన్ అంటూ ఒక ట్వీట్ చేసింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఏకంగా గూగుల్ తల్లి చేత స్పందింప చేసేలా టీజర్ ఉందంటే ఇంకేం కావాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version