అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా బాలీవుడ్ లో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ధఢక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ మొదటి సినిమాతోనే తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకొంది. ఇక ఆ తరువాత వరుస సినిమాలో నటిస్తూ మెప్పిస్తున్న జాన్వీ తాజాగా నటించిన చిత్రం గుడ్ లక్ జెర్రీ. తమిళ్ లో నయనతార నటించిన కోలమావు కోకిల సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో కోకో కోకిల పేరుతో తిలిజ్ అయ్యి ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకొంది. తమిళ్ లో నయన్ చేసిన పాత్రలో జాన్వీ కపూర్ నటిస్తోంది. సిద్దార్థ్ సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. తండ్రి లేని కుటుంబంలో పెద్ద దిక్కు జెర్రీ అలియాస్ జయ కుమారి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఎలాగోలా నెట్టుకొస్తున్న ఆమెకు తల్లికి క్యాన్సర్ అన్న విషయం తెలుస్తోంది. తల్లిని కాపాడుకోవడానికి, చెల్లిని చదివించుకోవడానికి డ్రగ్స్ అమ్మడానికి రెడీ అవుతోంది.
పోలీసుల కన్నుకప్పి డ్రగ్స్ సరఫరా చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. అలా డ్రగ్స్ అమ్ముతున్న జెర్రీ ఒక డ్రగ్స్ డీల్ లో మాఫియాకు చిక్కుతోంది. చివరికి ఆ డ్రగ్స్ ఏమయ్యాయి..? పోలీసులకు చిక్కకుండా జెర్రీ డ్రగ్స్ తీసుకెళ్ళిందా..? తన తల్లిని కాపాడుకుండా..? అనేది సినిమా కథగా తెలుస్తోంది. రీమేక్ అని చెప్పినా బాలీవుడ్ కు తగ్గట్టు కథను మార్చాడు దర్శకుడు. అమాయకమైన చూపులతో డ్రగ్స్ అమ్మే కంత్రీ ఖిలాడీ అమ్మాయిగా జాన్వీ అదరగొట్టేసింది. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించాడు దర్శకుడు. ఇక ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూలై 29న డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానుంది. మరి జాన్వీ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
