NTV Telugu Site icon

Aha: మూడోసారి అలరించడానికి ‘గీతా సుబ్రమణ్యం’ సిద్థం!

Geetha

Geetha

Geetha Subrahmanyam: ఆహాలో అందరినీ మెప్పించే కంటెంట్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక యూత్‌కు ఇష్టమైన ప్రేమ అనే అంశం మీద ఎక్కువగా ఆహా ఫోకస్ పెడుతుంటుంది. లోకల్ కంటెంట్‌ను ఎక్కువగా ప్రోత్సహించే క్రమంలో ఇప్పుడు ‘గీతా సుబ్రమణ్యం’ మూడో సీజన్‌ ఆహాలో రాబోతోంది. మే 5న ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ‘గీతా సుబ్రమణ్యం’ ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్‌ ఫుల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రేమ కథలో సుప్రజ్ రంగా సుబ్రమణ్యంగా కనిపించగా.. అభిజ్ఞ్య ఉతలూరు గీతగా నటించారు. ప్రేమలో ఉండే చిన్నపాటి గొడవలు ఎంతో ఫన్నీగా చూపించారు. ఎనిమిది ఎపిసోడ్‌లతో ‘గీతాసుబ్రమణ్యం’ అందరినీ మెప్పించేందుకు రెడీ అవుతోంది.

గీతా సుబ్రమణ్యం మూడో సీజన్ గీతా, సుబ్బుల మధ్య నడుస్తుంది. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ బిజీ లైఫ్‌ను గడుపుతుంటారు. ఒక ప్రాజెక్ట్ కోసం ఈ ఇద్దరినీ ఎంపిక చేయడం, అందులో ఉద్యోగులు ఎలాంటి రిలేషన్ షిప్‌లో ఉండకూడదని కండీషన్ పెడతారు. కానీ ఆ కండీషన్‌ను గీతా, సుబ్బు బ్రేక్ చేస్తారు. ప్రేమలో పడతారు. కానీ వారి ఫీలింగ్స్‌ను మిగతా ఉద్యోగుల ముందు బయట పెట్టకుండా మ్యానేజ్ చేస్తుంటారు. ఈ వెబ్ సిరీస్‌ను టమడ మీడియా నిర్మిస్తోండగా, శివ సాయి వర్దన్ దర్శకత్వం వహించారు.