NTV Telugu Site icon

Geeta Sakshiga Teaser: పద్మవ్యూహం లో చిక్కుకోవడానికి నేను అభిమన్యున్ని కాదు..

Geetha

Geetha

Geeta Sakshiga Teaser: ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ నటీ నటులుగా ఆంథోని మట్టిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గీత సాక్షిగా. పుష్పక్ మరియు జెబిహెచ్ఆర్ఎన్ కేఏల్ సమర్పణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై చేతన్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. రా అండ్ రస్టిక్ లుక్ లో ఆదర్శ్ కనిపించాడు. ఈ టీజర్ చూస్తుంటే ఇది కోర్ట్ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తుంది. టీజర్‌లో నటుడు ఆదర్శ్‌ను క్రిమినల్‌గా చూపించారు. ఇక అతనిని కాపాడడానికి చిత్రా శుక్లా లాయర్ గా పోరాడుతుండగా.. శ్రీకాంత్ అయ్యంగార్‌ వారికి విరుద్ధంగా వాదిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇక పోలీస్ గా భరణి వారికి హెల్ప్ చేస్తున్నట్లు కనిపించాడు. “పద్మ వ్యూహం లో చిక్కుకోవడానికి నేను అభిమన్యున్ని కాదు వాడి బాబు అర్జునున్ని రా” అంటూ ఆదర్శ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌ అదిరిపోయింది. ఇక ఈ సినిమా కోసం ఆదర్శ్ బాగా కష్టపడినట్లు తన సిక్స్ ప్యాక్ బాడీ చూస్తుంటేనే అర్ధమవుతోంది. ఇక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ అందించిన సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచింది. మొత్తానికి టీజర్ టోన్ సినిమాపై అంచనాలు పెంచేశారు చిత్ర బృందం. మరి వీరి కష్టానికి ప్రతిఫలం దక్కుతుందో లేదో సినిమా రిలీజ్ అయ్యేకా కానీ తెలియదు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించనున్నారు.

Show comments