కరోనా కాలం సెలెబ్రిటీ పెళ్లిళ్లకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. 2020 నుంచి దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీల పెళ్లిళ్లు వరుసగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరేందుకు మరో సెలెబ్రిటీ జంట సిద్ధమైంది. తమిళ నటులు గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. 2019లో విడుదలైన “దేవరత్తం” చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటి పరిచయం కాస్తా ప్రేమగా మారి పరిణయం దాకా వచ్చింది. అయితే వీరిద్దరూ ఇన్ని రోజులూ తమ రిలేషన్ ను రహస్యంగా ఉంచారు. వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చాలా మందికి తెలియదు.
Read Also : Gurthunda Seethakalam Trailer : సీజన్ ఆఫ్ మ్యాజిక్
ఇక ఈ ఏడాది గౌతమ్, మంజిమా పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. వీరి ప్రేమను కుటుంబ సభ్యులు కూడా ఆమోదించి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వినికిడి. త్వరలోనే ఈ జంట పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. మంజిమా మోహన్ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన “ఎఫ్ఐఆర్” చిత్రంలో కనిపించింది. ఇక 2016లో విడుదలైన “సాహసం శ్వాసగా సాగిపో” చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించిన విషయం తెలిసిందే. గౌతమ్ కార్తీక్ విషయానికొస్తే… ఆయన ప్రముఖ నటుడు కార్తీక్ కుమారుడు. మణిరత్నం దర్శకత్వం వహించిన కడల్ (తెలుగులో కడలి)తో గౌతమ్ తన నటనా రంగ ప్రవేశం చేశాడు. ఇప్పుడు ఈ జంట పెళ్ళికి సిద్ధమైందనే విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్.
