హనుమాన్ మీడియా బ్యానర్‌పై గతంలో సూపర్ మచ్చి, శాకాహారి, కాళరాత్రి, నేనే నా, కాజల్ కార్తీక, టీనేజర్స్, కథ కంచికి మనం ఇంటికి వంటి సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన విజయవంతమైన నిర్మాత బాలు చరణ్, ఇటీవల తమిళ నటుడు అరుళ్‌నీతి తమిళరాజు మరియు సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన గరుడ 2.0 చిత్రాన్ని ఆహా ఓటీటీలో విడుదల చేశారు.
Read More: Manchu Vishnu: పహల్గమ్ బాధిత కుటుంబాన్ని దత్తత తీసుకున్న మంచు విష్ణు
ఈ సూపర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గరుడ 2.0, ఆహా ఓటీటీలో టాప్-1 స్థానంలో ట్రెండింగ్‌లో ఉందని నిర్మాత వెల్లడించారు. ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటన అద్భుతం అని, ఆమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెబుతున్నారు. తమిళంలో ఆరత్తు సీనం (Aarathu Sinam) పేరుతో విడుదలై, అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్‌గా బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ఈ చిత్రం, తెలుగులో గరుడ 2.0గా ప్రేక్షకులను అలరిస్తోంది.
