NTV Telugu Site icon

Ganesh Master: డైరెక్టర్ గా మరో కొరియోగ్రాఫర్?

Ganesh Master

Ganesh Master

Ganesh Master to handle the Megaphone for the first time: చాలా మంది డాన్స్ కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారి కొంత మంది దర్శకులుగానే సినిమాలు చేస్తుంటే మరి కొంత మంది కాలం కలిసి రాక మళ్ళీ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ మధ్యనే విజయ్ బిన్ని అనే కొరియోగ్రాఫర్ కూడా దర్శకుడిగా మారి నాగార్జునతో నా సామి రంగా అనే సినిమా చేసి హిట్టు కొట్టాడు. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ నుంచి మరో కొరియోగ్రాఫర్ దర్శకుడిగా మారబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ కొరియోగ్రాఫర్ ఇంకెవరో కాదు ఢీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న గణేష్ మాస్టర్.

Maidaan Movie Review: మైదాన్ (హిందీ) రివ్యూ

గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా తెలుగులో చాలా సినిమాలకు పని చేశాడు. అయితే అక్కడ ఆయనకు రాని గుర్తింపు ఆయనకు ఢీ షో ద్వారా లభించింది. అయితే చాలా కాలం నుంచి ఆయన ఒక కథ సిద్ధం చేసుకుంటున్నారని, ఇప్పుడు కథ ఫైనల్ స్టేజికి రావడంతో పాటు నిర్మాత కూడా ఓకే చేయడంతో ఆయన త్వరలోనే డైరెక్టర్ గా ఒక సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆయన చిన్న హీరోలతో లేదా కొత్త హీరోలతో సినిమా చేస్తాడా? లేక ఎస్టాబ్లిష్డ్ హీరోతోనే సినిమా చేస్తున్నాడా? అనే విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. గణేష్ మాస్టర్ అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలకు సైతం కొరియోగ్రఫీ చేశారు. ఇప్పుడు ఆయన చేయబోయే సినిమా ఎలా ఉంటుంది అనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి.

Show comments