FNCC Flag Hoisting on Republic Day: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ 75 వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరి రావు జెండా ఆవిష్కరణ చేసి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి FNCC దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన క్లబ్ గా దినదినాభివృద్ధి చెందుతున్నట్టు వెల్లడించారు. ఆ అనంతరం సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, వైస్ ప్రెసిడెంట్ టి రంగారావు, కమిటీ మెంబర్ కాజా సూర్యనారాయణ, ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే ఎల్ నారాయణ, ఫార్మర్ సెక్రటరీ సోమరాజు మరియు ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కే వెంకటేశ్వర్ రావు తమ గణతంత్ర దినోత్సవ సందేశాలు అందించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ బి రాజశేఖర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు, కమిటీ మెంబర్స్ జే. బాలరాజు, ఏ. గోపాలరావు FNCC అడాప్ట్ చేసుకున్న గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు అలాగే FNCC మెంబర్స్ పాల్గొన్నారు.
FNCC: ఘనంగా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Fncc Flag Hoisting