Site icon NTV Telugu

Vishakapattana Kendram Movie : ‘ఆకాశ వాణి విశాఖపట్టణ కేంద్రం’ నుండి తొలి పాట ప్రసారం!

Vishaka Patnam Kendram

Vishaka Patnam Kendram

 

Vishakapattana Kendram Movie శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన  హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆకాశ‌వాణి విశాఖప‌ట్టణ కేంద్రం’. జ‌బ‌ర్దస్త్ ఫేం స‌తీష్ బ‌త్తుల ఈ చిత్రంతో దర్శకుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఎం. ఎం. అర్జున్‌ నిర్మాత‌. థ్రిల్లింగ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్నఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ , హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా విడుద‌ల చేస్తున్నారు. కార్తీక్ కొడ‌కండ్ల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి తొలి పాట‌ను చిత్ర యూనిట్ శుక్ర‌వారం విడుద‌ల చేసింది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎం. ఎం. అర్జున్ మాట్లాడుతూ ”సతీష్‌ చెప్పిన క‌థ బాగా న‌చ్చింది. ఆయ‌న సినిమాను నెరేట్ చేసిన దాని కంటే చ‌క్కగా తెర‌కెక్కించారు. ఓ మంచి సినిమాను రూపొందించ‌డంలో నిర్మాత‌గా నా వంతు బాధ్యత‌ను స‌మ‌ర్ధవంతంగా నిర్వర్తించాను. ఇది యూనివర్సల్ పాయింట్ కావటంతో పాన్ ఇండియా మూవీగా ఐదు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నాం” అన్నారు.

దర్శకుడు సతీష్ బత్తుల మాట్లాడుతూ ”ఇది డిఫ‌రెంట్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌. థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. నిర్మాత మ‌ల్లికార్జున్‌ గారి స‌పోర్ట్ లేక‌పోతే ఇంత దూరం రాగ‌లిగే వాళ్లం కాదు. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. శివ‌, హుమయ్, దేవీప్రసాద్‌, మాధ‌వీల‌త ఇలా మంచి ఆర్టిస్టులు; కార్తీక్ మ్యూజిక్‌, ఆరీఫ్ సినిమాటోగ్రఫీ ఇలా మంచి టెక్నీషియ‌న్స్ కుదిరారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది” అని అన్నారు.

 

 

Exit mobile version