Site icon NTV Telugu

Ram Karthik: “వీక్షణం” క్లైమాక్స్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు : హీరో రామ్ కార్తీక్ ఇంటర్వ్యూ

Veekshanam Ram Karthik

Veekshanam Ram Karthik

Ram Karthik interview about Veekshanam Movie: రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వీక్షణం”. ఈ చిత్రాన్ని ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మ‌నోజ్ ప‌ల్లేటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు యంగ్ హీరో రామ్ కార్తీక్.

Ananya Panday : బ్లాక్ డ్రెస్సులో కనిపించి కనిపించని అందాలతో అదరహో అనిపిస్తున్న అనన్య

డైరెక్టర్ మనోజ్ పల్లేటి “వీక్షణం” మూవీ స్క్రిప్ట్ చెప్పగా ఆసక్తికరంగా అనిపించింది. నేను ఇప్పటిదాకా విన్న కథలలో డిఫరెంట్ ఫీల్ కలిగించింది. మనం కథలు వినేప్పుడు నెక్స్ట్ ఇలా జరుగుతుంది అనుకుంటాం కానీ “వీక్షణం” కథ విన్నప్పుడు అలా గెస్ చేయలేకపోయాను. ప్రీ క్లైమాక్స్ తో పాటు మరికొన్ని హుక్ సీన్స్ ఉంటాయి అవి చాలా బాగుంటాయి. వాటి గురించి రివీల్ చేయలేను. ఈ సినిమాలో సరదాగా ఉండే కుర్రాడిలా కనిపిస్తా. అతనికి పక్కవాడి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. తనకున్న ఈ మనస్తత్వం వల్ల అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది మూవీలో మెయిన్ పాయింట్. ఈ యువకుడి జీవితంలోకి ఓ అమ్మాయి రావడం అతని కథ అనేక మలుపులు తిరగడం సినిమాలో చూస్తారు. హీరో క్యారెక్టర్ సరదా నుంచి క్రమంగా సీరియస్ నెస్ వైపు మళ్లుతుంది. సరదాగా ఉండే ఆ యువకుడు…డిటెక్టివ్ లా మారి తన చుట్టూ జరుగుతున్న విషయాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటాడు. “వీక్షణం” సినిమా లవ్ స్టోరీతో స్టార్ట్ అయ్యి మిస్టరీ థ్రిల్లర్ గా మారుతుంది. థ్రిల్లర్ మూవీస్ అంటే మైండ్ గేమ్. ప్రేక్షకుల్ని చివరి దాకా ఎంగేజ్ చేయగలిగితేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. అందుకే మా డైరెక్టర్ మనోజ్ స్క్రిప్ట్ పలు వెర్షన్స్ రాసుకున్నారు. స్క్రీన్ ప్లేలో హుక్ పాయింట్స్ ఉండేలా చూసుకున్నారు. మా మూవీలో ప్రీ క్లైమాక్స్ ను ఎవరూ ఊహించలేరు. మా మూవీలో హీరో మరొకర్ని అబ్జర్వ్ చేస్తుంటాడు, కానీ అతనికి తెలియకుండా మరో కన్ను ఆయన్ను చూస్తుంటుంది. అందుకే వీక్షణం అనే టైటిల్ పెట్టాం. కథకు చాలా యాప్ట్ టైటిల్ ఇది.

Exit mobile version