NTV Telugu Site icon

Extraordinary Man :డిసెంబర్ బాక్సాఫీస్ క్లాష్లోకి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఆరోజే రిలీజ్

Extra Ordinary Man

Extra Ordinary Man

Nithiin’s Extra Ordinary Man to release on December 8th: సలార్ సినిమా రిలీజ్ డేట్ మార్చుకోవడం ఎన్నో సినిమాల మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేయడంతో అనేక సినిమాలు ఇప్పుడు రిలీజ్ డేట్లు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముందుగా ఈ ఏడాది డిసెంబర్ 1న హిందీలో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యానిమల్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. ఇక అదే రోజు హాలీవుడ్ మూవీ సైలెంట్ నైట్ రిలీజ్ కాబోతోండగా డిసెంబర్ 8న విజయ్ సేతుపతి, కత్రీనా కైఫ్ కాంబినేషన్ లో హిందీలో తెరకెక్కుతున్న మేరీ క్రిస్మస్ మూవీ రిలీజ్ కానుంది.

Yatra 2: ‘యాత్ర 2’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని..!

అదే రోజున కరణ్ జోహార్ భారీ బడ్జెట్ తో సిద్ధార్ధ్ మల్హోత్రా హీరోగా నిర్మించిన యోధా మూవీ రిలీజ్ అవుతోండగా ఇప్పుడు తెలుగులో నితిన్ హీరోగా నటిస్తున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా కూడా రిలీజ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. ఇప్పటికే అదే రోజున వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, విశ్వక్ సేన్ గాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు రిలీజ్ డేట్లు కాల్ చేసుకోగా వాటితో పాటు నితిన్ సినిమా దిగుతోంది. నిజానికి నిజానికి తెలుగు నుండి డిసెంబర్ 21న హాయ్ నాన్న, డిసెంబర్ 22న సైందవ్ ఫిక్స్ చేసుకోగా వెంకటేష్ సినిమా సంక్రాంతికి వాయిదా పడగా నాని సినిమా డిసెంబర్ 7-8కి వాయిదా పడినట్లు చెబుతున్నారు. మొత్తం మీద డిసెంబర్ 8న మూడు -నాలుగు తెలుగు సినిమాలు రెండు మూడు బాలీవుడ్ సినిమాలతో పాటు ఒక హాలీవుడ్ సినిమా కూడా బరిలో దిగుతుండడం హాట్ టాపిక్ అవుతోంది.

Show comments