NTV Telugu Site icon

EVOL Trailer: రివర్స్ లవ్ స్టోరీగా ‘EVOL’.. ట్రైలర్ రిలీజ్

Evol Trailaer

Evol Trailaer

EVOL Movie Trailer Released: ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ కొత్తగా ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే నెత్తిన పెట్టేసుకుంటున్నారు. అందుకే దర్శకనిర్మాతలు కూడా కొత్తదనం ఉండేలా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమమంలోనే ఒక ఆసక్తికరమైన సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటించిన సినిమా EVOL. (LOVE) ని రివర్స్లో చూస్తే EVOL అని ఈ సినిమా కూడా ఒక రివర్స్ లవ్ స్టోరీగా మన ముందుకు రాబోతుందని వెల్లడించారు ప్రొడ్యూసర్ – డైరెక్టర్ రామ్ యోగి వెలగపూడి.

Bigg Boss 7 Arrests: బ్రేకింగ్: బిగ్ బాస్ 7 అల్లర్ల కేసులో మరో 16 మంది అరెస్టు..

ఈ కాలంలో జరుగుతున్న నిజ సంఘటనలు, కొన్ని నిజ జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నామని ఆయన వెల్లడించారు. రామ్ యోగి వెలగపూడి ఈ చిత్రానికి దర్శకుడిగా – నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఇద్దరు స్నేహితులు మధ్య జరిగే రహస్య ఒప్పందం ఆధారంగా తెరకెక్కింది అని తెలుస్తోంది. ఈ కాలంలో జరుగుతున్న యదార్థ సంఘటన ఆధారంగా బోల్డ్ సీన్స్ తో రియలిస్టిక్ సినిమాని తెరకెక్కించడం జరిగిందని మేకర్స్ చెబుతున్నారు. ఇక సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ పరిశీలిస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటూ సినిమా పైన ఆసక్తిని పెంచేసింది. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను తేడా బ్యాచ్ సినిమా – నక్షత్ర ఫిలిం ల్యాబ్స్ బ్యానర్ల మీద నిర్మించారు.