ఇప్పటి వరకు ఒకే పెళ్లితో జీవితం గడిపేయాల్సిన సమాజపు ఆలోచన మారిపోయింది. విడాకులు తీసుకున్న, జీవిత భాగస్వామి లేకపోయినా, కొత్త జీవితం కోసం మరోసారి పెళ్లి చేసుకోవడమే ఇప్పుడు సాధారణంగా మారింది. సామాన్యులే కాదు, సినీ ప్రపంచంలోనూ ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. సింగర్ సునీత నుంచి అక్కినేని నాగచైతన్య వరకు చాలామంది రెండో పెళ్లి చేసుకున్న ఉదాహరణలు ఉన్నాయి. అలాంటిది తాజాగా ఈ జాబితాలో చేరబోతున్నారంటూ వార్తల్లో నిలుస్తున్నారు హీరోయిన్ ఎస్తేర్ నొరోన్హా.
Also Read : Teja Sajja Mirai : మిరాయ్‌కి తేజా సజ్జా షాకింగ్ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే?
కర్ణాటకలోని ఉడిపి కి చెందిన ఎస్తేర్, ముంబైలో చదువుకున్నారు. బాలనటిగా కొంకణి సినిమాల్లో నటించి, ఆ తర్వాత 2012లో బారొమాస్ అనే హిందీ సినిమా ద్వారా హీరోయిన్‌గా అడుగుపెట్టారు. తెలుగులో పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన వేయి అబద్ధాలు సినిమాతో ఎంట్రీ ఇచ్చి, భీమవరం బుల్లోడు, గరం, జయ జానకి నాయక, ఐరావతం, 69 సంస్కార్ కాలనీ, చెంగురే బంగారు రాజా, డెవిల్, టెనెంట్, థలా వంటి సినిమాల్లో నటిస్తూ తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది. సినిమాల విషయం పక్కన పెడితే.. వ్యక్తిగత జీవిత విషయంలో మాత్రం తరచూ వార్తల్లో నిలిచింది. కారణం సింగర్ నోయెల్..
అతని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె, ఏడాదిలోనే మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఎస్తేర్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గాసిప్స్ వినిపించాయి. తాజాగా వాటిని నిజం చేస్తూనే ఓ బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. క్రైస్తవ వివాహంలో ధరించే తెల్లటి గౌను వేసుకుని, పడవలో కూర్చుని ఫోటోలు షేర్ చేశారు. వాటికి క్యాప్షన్‌గా.. “జీవితంలో మరో అందమైన సంవత్సరం.. అవకాశాలు, అద్భుతాలను ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. పుట్టినరోజు సందర్భంగా మీ ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. త్వరలోనే మీతో ఓ స్పెషల్ అనౌన్స్‌మెంట్ పంచుకుంటాను. వేచి ఉండండి” అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌తో ఎస్తేర్ నిజంగానే రెండో పెళ్లి చేసుకోబోతుందా అనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు “ఇది ఖచ్చితంగా వెడ్డింగ్ అనౌన్స్‌మెంట్” అని కామెంట్లు చేస్తున్నారు.
