NTV Telugu Site icon

Emanuel: చివరి చూపు దక్కలేదు.. జబర్దస్త్ స్కిట్ చేస్తూ వెక్కి వెక్కి ఏడ్చా.. ఇమ్మాన్యుయేల్ ఆవేదన

Jabardasth Emmanuel Crying

Jabardasth Emmanuel Crying

Emanuel Jabardast Emotional comments: జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న కమెడియన్లలో ఇమ్మానియేల్ కూడా ఒకరు. ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్స్ అందరూ జబర్దస్త్ వదిలేసి వేరేవి చూసుకుంటున్న నేపథ్యంలో ఎంటర్ అయిన ఇమ్మానుయేల్ అతి తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించాడు. ఇక వర్షతో లవ్ ట్రాక్ మొదలుపెట్టిన తర్వాత మనోడి దశ తిరిగిపోయింది. తెలుగులో దాదాపు ప్రతి ఇంటికి ఇమ్మానుయేల్ అంటే ఎవరో పరిచయం అయిపోయాడు. ఇక ఇప్పుడు ఇమ్మానుయేల్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు కానీ మొట్టమొదటిసారి ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న గం గం గణేశా సినిమాలో పూర్తిస్థాయి హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటున్న ఇమ్మానుయేల్ తన జీవితంలో ఎదురైన ఒక విషాదకర సంఘటన గురించి షేర్ చేసుకున్నాడు.

Hit List: హీరోగా తమిళ డైరెక్టర్ కొడుకు.. హిట్ లిస్ట్ అంటూ వచ్చేస్తున్నాడు!

అదేంటంటే జబర్దస్త్ లోకి వచ్చిన కొత్తలో అప్పుడప్పుడే మంచి పేరు వస్తుందని, అయితే ఒకరోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో తన తండ్రి ఫోన్ చేసి తాత చనిపోయిన విషయం చెప్పాడని పేర్కొన్నాడు. నిజానికి తన తాత అంటే చాలా ఇష్టం కానీ అప్పుడు వెళ్తే జబర్దస్త్ ప్రోగ్రాం డిస్టర్బ్ అవుతుందని భావించి వెళ్లలేక పక్కకు వెళ్లి కాసేపు వెక్కివెక్కి ఏడ్చానని తర్వాత కళ్ళు తుడుచుకుని వచ్చి స్కిట్ పెర్ఫార్మ్ చేస్తే ఆ స్కిట్ అద్భుతంగా వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ తాను చేసిన బెస్ట్ స్కిట్స్ లో అది కూడా ఒకటిగా ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. ఇక అయితే ఆ స్కిట్ చేయడం పూర్తయ్యాక ఇంటికి వెళ్తే అప్పటికే అంత్యక్రియలు పూర్తయ్యాయని తాత చివరి చూపు కూడా చూసుకోలేకపోయానని ఇమ్మానుయేల్ ఎమోషనల్ అయ్యాడు. అలాంటివన్నీ దాటుకుని వచ్చాను కాబట్టి ఈరోజు ఎంతో కొంత నిలబడగలుగుతున్నానని కామెంట్ చేశాడు.

Show comments