NTV Telugu Site icon

Emandoy Srimathigaru: జనవరి 22 నుంచి జెమినీ టీవీలో “ఏవండోయ్ శ్రీమతి గారు”

Emandoy Srimathigaru

Emandoy Srimathigaru

Emandoy Srimathigaru Serial: తెలుగు ప్రేక్షకుల వినోదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమినీ టీవీ. ఎన్నో కార్యక్రమాలను , మరిన్నో సీరియల్స్ ను అందించిన జెమినీ టీవీ.. ఇప్పుడు మనకు “ఏవండోయ్ శ్రీమతి గారు”.. అనే సరికొత్త సీరియల్ ను జనవరి 22 నుంచి ప్రసారం చేయబోతోంది. గౌరవ మర్యాదలు కలిగిన గ్రామ సర్పంచ్ సుబ్బారాయుడి కుమార్తె మిథున హీరోయిన్. మిథున పెళ్లిపీటల మీద నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోవడంతో తండ్రి సుబ్బారాయుడిని ఊరి వాళ్ళంతా అవమానిస్తారు, ఇది రెండోసారి జరగడంతో ఇద్దరి కూతుళ్లు తన నమ్మకాన్ని వొమ్ము చేశారు అని వాళ్ల ముందు నిలబడలేకపోతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సిటీలో మిథున -గౌతమ్ లు తమ తమ పిల్లలతో కలిసి అనుకోని పరిస్థితుల్లో భార్యాభర్తల్లా ఒకే ఇంట్లో అద్దెకు దిగుతారు. అక్కడ వాళ్ళు కలిసుంటారా లేక కలిసిపోతారా..? వారి మధ్య ప్రేమ చిగురిస్తుందా లేక ఎవరి దారి వాళ్లు చూసుకుంటారా.? నాలుగు జీవితాలు, రెండు కథలు, ఒకే ఇల్లు..! సరికొత్త కథతో సరికొత్త ధారావాహిక జెమిని టివిలో.. ఏవండోయ్ శ్రీమతి గారు ఈనెల 22న ప్రారంభం – సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం కానుంది. “ఏవండోయ్ శ్రీమతిగారు ”. సీరియల్లో పల్లవి గౌడ, హర్షిత్ శెట్టి, మమ్మూటి శ్రీనివాస్, శాంతి, గుత్తి కొండ భార్గవ, దేవీశ్రీ, చైత్ర రాయ్, క్రిష్ణ, తదితర నటీనటులు నటించారు. ఈ నెల 22వ తేదీ సోమవారం సా 6:30 గం.లకు జెమినీ టీవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ “ఏవండోయ్ శ్రీమతిగారు ”. సీరియల్ ప్రేక్షకుల ఆధారాభిమానాలను పొందడంలో ఎలాంటి సందేహం లేదని జెమినీ టీవీ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేశారు.