‘హుషారు, షికారు, రౌడీ బాయ్స్’ చిత్రాలలో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు తేజ్ కూరపాటి. తను సోలోగా హీరోగా వస్తున్న చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్ వందెల దర్శకత్వంలో ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారధ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు నిర్మించిన ఈ చిత్రంలో అఖిల ఆకర్షణ హీరోయిన్. ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేసారు మేకర్స్. డా.భవ్య దీప్తి రెడ్డి రచించిన ‘ఏకాంత సమయం’ అనే లిరికల్ వీడియోను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఇందులోని ఐదు పాటలను భవ్య దీప్తి రెడ్డి రాయగా సందీప్ మ్యూజిక్ అందించారు. అనుకున్న టైమ్, అనుకున్న బడ్జెట్ లో ఈ సినిమా తీశామని, తనికెళ్ళ భరణి, జీవా తో పాటు ఇతర నటీనటలు, సాంకేతిక నిపుణులు చక్కటి సహకారం అందిచారని నిర్మాతలు చెబుతున్నారు. పల్లెటూరి నేపధ్యం లో సాగే చక్కటి ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కించినట్లు దర్శకుడు తెలిపారు.
