Eagle Pre Release Business : మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం 2024లో విడుదలవుతున్న భారీ అంచనాలున్న సినిమాల్లో ఒకటిగా ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలని ముందునుంచి సన్నాహాలు చేశారు మేకర్స్, అయితే ఐదు చిత్రాలు పండగకు రావడంతో థియేటర్స్ రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో సినీ పరిశ్రమ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈగల్ చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి 9న ‘ఈగల్’ సినిమాను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇక ఈగల్ సినిమాకి మంచి పాజిటివ్ బజ్ ఉంది.
Yatra2 Movie Review: యాత్ర2 మూవీ రివ్యూ..
రవితేజ ఫ్యాన్స్ ఈ సారి కచ్చితంగా ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ఫుల్ పాజిటివ్‌గానే కనిపిస్తున్న క్రమంలో రవితేజ తన ఈగల్ సినిమాను చూసి ఫుల్ శాటిస్‌ఫైడ్ అంటూ చెప్పిన మాటలు మరింత అంచనాలు పెంచేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకొచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెక్కల ప్రకారం నైజాంలో 6 కోట్లు, సీడెడ్‌లో 2.5 కోట్లు, ఆంధ్రాలో 8.5 కోట్లు మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల బిజినెస్ చేసింది. కర్ణాటక సహా రెస్టాఫ్ ఇండియాలో రెండు కోట్లు.. ఓవర్సీస్ లో రెండు కోట్లు.. అలా మొత్తంగా ఈ చిత్రానికి 21 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టుగా ట్రేడ్ వర్గాల వారి లెక్కలు చెబుతున్నాయి. ఇక ఈ లెక్కన సినిమా 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రవితేజ రంగంలోకి దిగబోతోన్నాడు.
