I Am Game Release Date: దుల్కర్ సల్మాన్ సినిమాలకు మాలీవుడ్‌లోనే కాదు, దక్షిణాది మొత్తం ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన కొత్త సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు మొదలవుతున్నాయి. ఇప్పుడు అదే స్థాయి హైప్ లో వెళ్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’. అయితే ఈ మూవీ రిలీజ్ విషయంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆగస్టు 20న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా వాయిదా వేస్తూ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఐ యామ్ గేమ్’ను ఇప్పుడు 2026 సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం సినిమా థియేట్రికల్ విడుదలను మరింత విస్తృతస్థాయిలో అందించడానికేనని నిర్మాతలు తెలిపారు. ‘ఐ యామ్ గేమ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో కొంత జాప్యం జరగడం, అలాగే ఈ చిత్రాన్ని మరిన్ని భాషల్లో పాన్-ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలనే ప్లాన్ ఉండటం వల్ల వాయిదా పడినట్లు తెలుస్తోంది. మేకర్స్ కూడా ఇదే క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను మొదట ఓనం కానుకగా 2026 ఆగస్టు 20న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా చేర్చాలనే ఉద్దేశంతో, రిలీజ్ డేట్ ను మారుస్తూ మేకర్స్ అధికారికంగా మరో ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదల కానుంది. దుల్కర్‌కు దక్షిణాదితో పాటు నార్త్ ఇండియాలోనూ మంచి గుర్తింపు ఉండటంతో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
వాస్తవానికి సినిమా వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం కొంతకాలంగా వినిపించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం జరుగుతోందని వార్తలు వచ్చినప్పటికీ, మేకర్స్ అధికారికంగా స్పందించలేదు. ఇప్పుడు సెప్టెంబర్ 3ను కొత్త విడుదల తేదీగా ప్రకటించడంతో ఆ సస్పెన్స్‌కు తెరపడింది. ‘ఐ యామ్ గేమ్’ కథకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర బృందం ఇప్పటికీ గోప్యంగానే ఉంచింది. యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో కనిపించనుండగా, కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్నారు. ఆంటోని వర్గీస్, మిస్కిన్, కతిర్, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

