నందమూరి నటసింహం బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి రావాలని అభిమానులు కూడా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.ఇదివరకు బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడు అని వార్తలు కూడా వచ్చాయి.కానీ ఆ సినిమాలో కుదరలేదు.కొన్నాళ్లకు మోక్షజ్ఞకు అసలు సినిమాల మీద ఆసక్తి లేదని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా మోక్షజ్ఞ లుక్స్ అభిమానులకు భారీ సర్ప్రైజ్ ఇచ్చాయి. పూర్తిగా హీరోలాగా మోక్షజ్ఞ కనిపిస్తున్నట్లుగా సమాచారం.. ఇప్పటికే మోక్షజ్ఞ నటన మరియు డ్యాన్స్ పై ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం.మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై బాలకృష్ణ కూడా స్పందించారు. అయితే మోక్షజ్ఞ తో సినిమా ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 తో ఉంటుందని అందరూ కూడా అనుకున్నారు. ఆ సినిమాను బాలకృష్ణ స్వయంగా డైరెక్ట్ చేసి మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయాలని అయితే అనుకున్నారు. కానీ ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నాడు. ఈ లోగా మోక్షజ్ఞ హీరోగా పరిచయం చేయాలని బాలయ్య ఫిక్స్ అయ్యారని సమాచారం..అయితే మోక్షజ్ఞ మొదటి సినిమా ఏ డైరెక్టర్ కి అప్పగిస్తాడు అనేది ఆసక్తిగా మారింది.
అయితే బోయపాటి శ్రీను మరియు క్రిష్ లాటి డైరెక్టర్ లు ముందు వరుసలో అయితే ఉన్నారు. కానీ బాలకృష్ణ ఆసక్తి మొత్తం పూరీ జగన్నాథ్ మీద ఉందని. రామ్ చరణ్ మొదటి సినిమా పూరి జగన్నాథ్ తోనే జరిగింది. అందుకే మోక్షజ్ఞ ఎంట్రీ కూడా పూరీ జగన్నాథ్ తో చేయించాలని చూస్తున్నట్లు సమాచారం.అయితే అప్పుడు పూరి బాగా ఫామ్ లో ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయన అంతగా సక్సెస్ లో అయితే లేడు. మోక్షజ్ఞ ఎంట్రీ పూరితో అంటే కొంచెం రిస్క్ అని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. కానీ పూరితో సినిమా అంటే హీరో క్యారెక్టరైజేషన్ బాడీ లాంగ్వేజ్ కూడా వేరే లెవెల్ లో ఉంటుంది. అందుకే పూరీ డైరెక్షన్లో మోక్షజ్ఞ సినిమా చేస్తే ఫ్యాన్స్ కి బాగా దగ్గరవుతాడని సమాచారం.