NTV Telugu Site icon

Naga Chaitanya : సమంతతో డివోర్స్.. నాగ చైతన్య కీలక కామెంట్స్..

Chaisam

Chaisam

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య ఓ పాడ్ కాస్ట్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా సమంతతో విడాకుల పట్ల స్పందించాడు చైతన్య.

Also Read : RC 16 : రామ్ చరణ్ 16.. కథ, నేపథ్యం ఏంటో చేప్పేసిన డీవోపీ

నా లైఫ్ లో ఏదైతే జరిగిందో చాలా మంది లైఫ్ లో జరిగింది. నా ఒక్కడి లైఫ్ లోనే జరగలేదు. కానీ నన్నుక్రిమినల్ లాగా చూసారు. ఒక రిలేషన్ షిప్ ని బ్రేక్ చేయాలి అంటే నేను వేయి సార్లు ఆలోచిస్తాను. ఎందుకంటే దాని తర్వాత జరిగే పరిణామాలు నాకు బాగా తెలుసు. నేనూ కూడా ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. ఆ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంటదో నాకు తెలుసు. ఆ సంఘటన వలన నేను చాలా బాధపడ్డాను. నేను సమంత ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఎవరి దారిలో వాళ్ళు, ఎవరి జీవితాలు వాళ్లు లీడ్ చేస్తున్నాం. అది అనుకోకుండా ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. కొందరికి అది ఒక గాసిప్ లా అయిపోయింది. ఇంకొందరికి అది ఎంటర్టైన్మెంట్ లా అయిపోయింది. ఆ సమయంలో నేను ఆ ఇష్ష్యు గురించి మాట్లాడితే ఇంకొన్ని ఆర్టికల్స్ రాస్తారు. ఇంకా వాటికి ఫుల్ స్టాప్ అనేది ఎక్కడ ఉంది. రాసేవాళ్లకి ఫుల్ స్టాప్ ఎక్కడ ఉంది. నా లైఫ్ గురించి ఆలోచించడం కాకుండా మీ లైఫ్ మీద ఇన్వెస్ట్ చేయండి’ అని అన్నాడు.