Site icon NTV Telugu

Vedika: “యక్షిణి”గా మారిన వేదిక.. హాట్ స్టార్లో సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్

Vedhika Yakshini

Vedhika Yakshini

Disney+ Hotstar announces Hotstar Specials “Yakshini”: ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ సంస్థలు కలిసి చేసిన పరంపర, పరంపర 2 వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించాయి. ఇప్పుడు ఇదే కాంబోలో “యక్షిణి” అనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. “యక్షిణి” వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Anushka – Vijayashanthi: విజయేంద్ర ప్రసాద్ కథతో రాములమ్మ, జేజమ్మ సినిమా?

అర్జున ఫాల్గుణ, జోహార్, కోట బొమ్మాళి పీఎస్ వంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ మార్ని “యక్షిణి” సిరీస్ ను రూపొందిస్తున్నారు. కృష్ణ, మాయ పాత్రలతో సోషియో ఫాంటసీ నేపథ్యాన్ని ఈ సిరీస్ కు ఎంచుకున్నారు దర్శకుడు తేజ మార్ని. ఫాంటసీ, రొమాన్స్, కామెడీ అంశాలతో రూపొందిన “యక్షిణి” ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. డైరెక్టర్ తేజ మార్ని విజన్ కు తగినట్లు భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఆర్కా మీడియా వర్క్స్ ఈ సిరీస్ ను నిర్మించింది. జూన్ లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో “యక్షిణి” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది.

Exit mobile version