Disney D23 2026: డిస్నీ ఫ్యాన్స్‌కి వచ్చే రోజులు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. నిన్న జరిగిన D23 అల్టిమేట్ ఫ్యాన్ ఈవెంట్‌లో డిస్నీ చాలా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రకటించింది. కొన్ని ఈ ఏడాదే, మరికొన్ని 2027, 2028లో రాబోతున్నాయి. పాత క్లాసిక్‌ల సీక్వెల్స్ నుంచి మార్వెల్, స్టార్ వార్స్ వరకు ఎన్నో ఉన్నాయి. ఒక్కోదాని గురించి కొంచెం వివరంగా చూద్దాం.
లిలో & స్టిచ్ 2
‘లిలో & స్టిచ్ 2’ అనగానే డిస్నీ సంస్థ 2005లో విడుదల చేసిన పాత యానిమేషన్ చిత్రం ‘లిలో & స్టిచ్ : స్టిచ్ హాస్ ఎ గ్లిచ్’ గుర్తుకువస్తుంది. ఇందులో స్టిచ్‌లోని టెక్నికల్ లోపాన్ని సరిదిద్ది లిలో తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుందనేది కథాంశం. అయితే ప్రస్తుతం డిస్నీ ‘D23’ ఈవెంట్‌లో దీనికి సంబంధించిన సరికొత్త లైవ్-యాక్షన్ సీక్వెల్ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ 2028 మే 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఒరిజినల్ మేకర్ క్రిస్ సాండర్స్ దర్శకత్వంలో సరికొత్త కథతో రాబోతున్న ఈ 2028 లైవ్-యాక్షన్ చిత్రంలో స్టిచ్ పింక్ కలర్ జోడి ‘ఏంజెల్’ (Angel – ఎక్స్‌పెరిమెంట్ 624) అనే కొత్త ఏలియన్ క్యారెక్టర్‌ను పరిచయం చేయబోతున్నారు.
ఐస్ ఏజ్: బాయిలింగ్ పాయింట్
‘ఐస్ ఏజ్: బాయిలింగ్ పాయింట్’ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన ‘ఐస్ ఏజ్’ సిరీస్ నుండి రాబోతున్న ఆరవ యానిమేషన్. ఇది 2027 ఫిబ్రవరి 5న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జాన్ డోంకిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అకస్మాత్తుగా అగ్నిపర్వతం బద్దలై లావా పొంగిపొర్లుతుండటంతో, మ్యానీ, సిడ్, డియెగో వారి స్నేహితుల గుంపు ప్రాణాలు కాపాడుకోవడానికి డైనోసార్లతో నిండిన ఒక సరికొత్త ప్రమాదకరమైన ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. రే రొమానో, జాన్ లెగుయిజామో, సైమన్ పెగ్ వంటి నటులు తమ పాత పాత్రలకు వాయిస్ ఓవర్ అందిస్తున్న ఈ చిత్రంలో, మనందరికీ ఇష్టమైన స్క్రాట్ తో పాటు జురాసిక్ సైజులో ఉండే ఒక సరికొత్త స్పెషల్ క్యారెక్టర్‌ను కూడా డిస్నీ ‘D23’ ఈవెంట్‌లో చిత్ర బృందం పరిచయం చేసింది.
టాంగిల్డ్ (లైవ్ యాక్షన్)
డిస్నీ ‘D23’ ఫ్యాన్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించిన “టాంగిల్డ్” (Tangled) లైవ్-యాక్షన్ చిత్రం మార్చి 31, 2028 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ‘ది గ్రేటెస్ట్ షోమ్యాన్’ ఫేమ్ మైఖేల్ గ్రేసీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాపుంజెల్ పాత్రలో ఆస్ట్రేలియన్ నటి టీగన్ క్రాఫ్ట్ నటిస్తుండగా, ఫ్లిన్ రైడర్ పాత్రలో మిలో మాన్‌హీమ్, విలన్ మదర్ గోథెల్ పాత్రలో కాథరిన్ హాన్ నటిస్తున్నారు. స్పెయిన్, యూకే పరిసరాల్లోని చారిత్రాత్మక కట్టడాల నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఓస్వాల్డ్
‘ఓస్వాల్డ్’ అనగానే మనకు ప్రధానంగా వాల్ట్ డిస్నీ ఉబ్ ఐవర్క్స్ కలిసి 1927లో సృష్టించిన మొట్టమొదటి ఐకానిక్ కార్టూన్ క్యారెక్టర్ ‘ఓస్వాల్డ్ ది లక్కీ రాబిట్’ గుర్తుకువస్తుంది, ఇది మిక్కీ మౌస్ కంటే ముందే పుట్టి డిస్నీ చరిత్రలోనే ఎంతో ప్రాధాన్యత కలిగిన నల్లటి కుందేలు పాత్రగా నిలిచింది. ఇప్పుడు మూడు ఎపిసోడ్‌ల చిన్న సిరీస్‌గా 2027 ఫిబ్రవరిలో డిస్నీ+లో స్ట్రీమింగ్ కానుంది.
విజన్ క్వెస్ట్
‘విజన్ క్వెస్ట్’ అనేది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుండి రాబోతున్న ఒక సరికొత్త వెబ్ సిరీస్. నిన్ననే జరిగిన డిస్నీ ‘D23’ ఫ్యాన్ ఈవెంట్‌లో దీనికి సంబంధించిన అధికారిక ట్రైలర్‌ను విడుదల చేస్తారు. ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ 2026 అక్టోబర్ 10 నుండి వరల్డ్‌వైడ్‌గా స్ట్రీమింగ్ కానుంది.
అవెంజర్స్: డూమ్స్‌డే
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుండి రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన హాలీవుడ్ చిత్రం “అవెంజర్స్: డూమ్స్‌డే” (Avengers: Doomsday) ప్రపంచవ్యాప్తంగా 2026 డిసెంబర్ 18న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. పాపులర్ డైరెక్టర్స్ రూసో బ్రదర్స్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో, ‘ఐరన్ మ్యాన్’ ఫేమ్ రాబర్ట్ డౌనీ జూనియర్ సరికొత్త విలన్ ‘డాక్టర్ డూమ్’ పాత్రలో నటిస్తుండటం విశేషం. మల్టీవర్స్ నేపథ్యంలో సాగే ఈ కథలో విలన్ డాక్టర్ డూమ్‌ను అడ్డుకోవడానికి అవెంజర్స్ బృందంతో పాటు ‘ఫెంటాస్టిక్ ఫోర్’, ఒరిజినల్ ‘ఎక్స్-మెన్’ క్యారెక్టర్లు ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ఇటీవల డిస్నీ ‘D23’ ఫ్యాన్ ఈవెంట్‌లో దీనికి సంబంధించిన సరికొత్త ట్రైలర్, పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేయగా, ఈ చిత్రం భారతదేశంలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, మరియు తమిళం భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
ఎక్స్-మెన్ (కొత్త తారాగణం ప్రకటన)
మార్వెల్ తన కొత్త ఎక్స్-మెన్ చిత్రం తారాగణాన్ని కూడా ప్రకటించింది. జీన్ గ్రే పాత్రలో సాడీ సింక్ నటిస్తుంది. మిస్టర్ సినిస్టర్ అయిన నథానియల్ మిల్బరీ పాత్రకు ఆడమ్ డ్రైవర్‌ను అధికారికంగా ఎంపిక చేశారు. మ్యూటెంట్స్‌లో చేరనున్న చార్లెస్ జేవియర్ అలియాస్ ప్రొఫెసర్ ఎక్స్ పాత్రలో క్రిస్ అబాట్ కూడా నటిస్తున్నారు. రోగ్ పాత్రలో ఇండే నవరెట్, స్టార్మ్ పాత్రలో మాయా బాయిడ్ నటిస్తున్నారు. ఎమ్మా ఫ్రాస్ట్ పాత్రలో సమారా వీవింగ్, సైక్లోప్స్ పాత్రలో కిట్ కానర్ నటిస్తారు. ఈ చిత్రం 2028 మే 5న విడుదల కానుంది.
ఫ్రోజెన్ 3
డిస్నీ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యానిమేషన్ చిత్రం “ఫ్రోజెన్ 3” (Frozen 3) ప్రపంచవ్యాప్తంగా 2027 నవంబర్ 24 న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవల జరిగిన డిస్నీ ‘D23’ ఫ్యాన్ ఈవెంట్‌లో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, సరికొత్త క్యారెక్టర్ కాస్ట్యూమ్స్ రివీల్ చేశారు. జెన్నిఫర్ లీ దర్శకత్వంలో వస్తున్న ఈ సీక్వెల్‌లో అన్నా, ఎల్సా, క్రిస్టాఫ్, మరియు ఓలాఫ్ మళ్లీ అలరించనున్నారు. సరికొత్త పాటలతో రాబోతున్న ఈ సినిమాతో పాటు, దీని తదుపరి భాగమైన ‘ఫ్రోజెన్ 4’ కూడా నిర్మాణంలో ఉందని డిస్నీ ప్రకటించింది.
అహ్సోకా సీజన్ 2
స్టార్ వార్స్ ప్రపంచం నుండి మరో విజయవంతమైన సిరీస్, అహ్సోకా, కూడా కొత్త సీజన్‌తో రాబోతోంది. మొత్తం తారాగణంతో కూడిన కొత్త టీజర్‌ను విడుదల చేస్తూ, D23 ఫ్యాన్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ సిరీస్ జనవరి 20, 2027 నుండి డిస్నీ ప్లస్‌లో అందుబాటులో ఉంటుంది.
స్టార్ వార్స్: స్టార్‌ఫైటర్
రయాన్ గోస్లింగ్ హీరోగా నటించే కొత్త స్టార్ వార్స్ సినిమా. 2028లో విడుదల కానున్న ఈ చిత్రం ‘స్టార్ వార్స్ స్టార్‌ఫైటర్’ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ ఫ్యాన్ ఈవెంట్‌కు చిత్ర బృందం మొత్తం హాజరై తమ సినిమా ప్రమోషన్ లో కూడా పాల్గొన్నారు.
ఇన్క్రెడిబుల్స్ 3
పిక్సార్ అత్యంత ఇష్టమైన సూపర్ ఫ్యామిలీ యానిమేషన్. కొత్త పోస్టర్‌లో అన్ని పాత్రలు కనిపించాయి. 2028 జూన్‌లో థియేటర్లలో విడుదల కానుంది. కుటుంబంతో కలిసి చూడడానికి బెస్ట్.
జూటోపియా 3
గత సంవత్సరం జూటోపియా 2 విజయం సాధించిన నేపథ్యంలో, జూటోపియా 3ని ప్రకటించారు. ఈ యానిమేటెడ్ చిత్రంపై పనులు ప్రారంభమయ్యాయని, ఇది త్వరలో విడుదల కానుందని డిస్నీ ప్రకటించింది. మొత్తం మీద డిస్నీ ఫ్యాన్స్‌కి వచ్చే రెండు-మూడు ఏళ్లు చాలా బిజీగా ఉండబోతున్నాయి. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో నోట్ చేసుకుని ఎదురు చూసి తనివి తీరా చూసి ఆనందించండి.

