Site icon NTV Telugu

Khiladi Controversy : రవితేజ చీప్ స్టార్… డైరెక్టర్ వైఫ్ సంచలన కామెంట్స్

Raviteja

మాస్ మహారాజ రవితేజపై ప్రముఖ దర్శకుడి భార్య చేసిన ఇన్ డైరెక్ట్ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫిబ్రవరి 11న “ఖిలాడీ” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా విడుదలకు ముందు హీరో, దర్శకుడి మధ్య విభేదాలు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ‘ఖిలాడీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ చేసిన వ్యాఖ్యలు ఆ విభేదాలు నిజమే అనుకునేలా చేశాయి. దర్శకుడు రమేష్ వర్మకు నిర్మాత కోనేరు సత్యనారాయణ అరటి పండు ఒలిచి నోట్లో పెట్టునట్టుగా అన్నీ సమకూర్చారని, ఆయన మహార్జాతకుడని అన్నారు. అంతేకాకుండా నిర్మాత సెట్ కు రావాలని, వస్తేనే అన్నీ తెలుస్తాయని అన్నారు. ఇదిలా ఉండగా సినిమా విడుదల రోజు డైరెక్టర్ రమేష్ వర్మ భార్య రేఖ వర్మ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత దూరం తీసుకెళ్లినట్టు కన్పిస్తోంది.

Read Also : SVP Song Leaked : పనిస్తే ఇలాంటి పని… వాడికి తెలియాలంటూ తమన్ ఎమోషనల్

రేఖ వర్మ తన ఇన్స్టా స్టోరీస్ లో దర్శకుడు అజయ్ భూపతి చీప్ స్టార్ అని ఎందుకు అన్నారో అర్థమైందని, అరటి పండు తీయడం ఆయనకు బాగా వచ్చు అనుకుంటా… డైరెక్టర్ గారూ నెక్స్ట్ టైం ఆర్టీ దగ్గర క్లాసెస్ తీసుకోండి. ఆయనకు అరటి చెట్టును నరికి ఇచ్చినా సరిపోలేదు ఆర్టీకి. డైరెక్టర్ కి ఒక స్టైల్ ఉంటుంది. అది మీకు చెప్పి చేయిస్తేనే కెమెరాల్లో యంగ్ అండ్ స్టైలిష్ గా కన్పిస్తారు. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్… మాస్ ని క్లాస్ చేసిన రమేష్ గారి స్టైల్ థియేటర్లలో కన్పిస్తుంది అంటూ పోస్ట్ చేసింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆమెపై కౌంటర్లు మొదలయ్యాయి. అందుకే రవితేజ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా మాట్లాడారు అంటున్నారు.

Exit mobile version