Site icon NTV Telugu

Baby Leaks: సాయి రాజేష్ ‘బేబి’ కాపీ.. సాక్ష్యాల‌తో ‘బేబీ లీక్స్’ బుక్.. దర్శకుడు సంచలనం!

Baby Sai Rajesh Vs Sirin Sriram

Baby Sai Rajesh Vs Sirin Sriram

Director Sirin Sriram Releases a Book on BABY movie director Sai Rajesh: శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ‘ప్రేమించొద్దు’ని పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ని జూన్ 7న విడుదల చేస్తున్నారు. . శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందింది. ఇక శిరీన్ శ్రీరామ్ తనకు సాయి రాజేష్ చేసిన అన్యాయం, తన కథను కాపీ కొట్టి బేబీగా తీయడం మీద మరోసారి స్పందించాడు. సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలు బేబీ లీక్స్ అంటూ పుస్తకరూపంలో తీసుకొచ్చానని చెబూతూ బేబీ లీక్స్ అనే బుక్‌ను మీడియా ముందుంచారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో శిరీన్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘రవి కిరణ్ అనే వ్యక్తిని 2015లో కలిశా, తరువాత రవి కిరణ్ ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్ట్ చూసి ఓ పాయింట్ అనుకున్నాను.

Emanuel: చివరి చూపు దక్కలేదు.. జబర్దస్త్ స్కిట్ చేస్తూ వెక్కి వెక్కి ఏడ్చా.. ఇమ్మాన్యుయేల్ ఆవేదన

ఓ అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు కలిసి చంపారనే పోస్ట్ చూసి కథ అనుకున్నాం. దాన్ని ఓ బస్తీ అమ్మాయి పాత్రతో లింక్ చేసి కథ రాసుకున్నా. ఆ టైంలో నిర్మాత సాయి రాజేష్ తో ఏడాది ప్రయాణం చేశా, నాకు దర్శకుడిగా అవకాశం ఇస్తూ ఆయనే సినిమాను నిర్మిస్తానన్నారు. అయితే ఆలస్యం అవుతూ వచ్చింది. కారణాలేమైనా ఉండొచ్చేమో అనిపించి, ఆయన సినిమా నిర్మించడం లేదని నేను బయటకు వచ్చేశా, అప్పుడు మాకేం గొడవ జరగలేదు. త‌ర్వాత నాకు ద‌ర్శ‌క‌త్వం అవ‌కాశం ఇస్తాన‌న్న‌వాడు.. నా క‌థ‌ను కాపీ కొట్టి అదే బస్తీ అమ్మాయి.. ఇద్దరబ్బాయిల్ని ప్రేమించే కథతో బేబీ అనే ఓ బూతు సినిమా తీశాడు.

2023 జూలైలో సినిమా రిలీజ్ అయినప్పుడు రచ్చ చేయలేదు ఎందుకంటే నాకు రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సాక్షాలు అన్నీ సంపాదించి లాయర్ నిఖిలేష్ ని కలిశాను. కాపీరైట్ లీగల్ నోటీసు పంపాం కానీ నాకే ఆయన ఆ కథను చెప్పాడని ఆ నోటీసులో రిప్లై ఇచ్చారు. ఫిబ్రవరిలో రాయదుర్గంలో కేస్ ఫైల్ చేశాను. నన్ను బద్నాం చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదులు చేశా, ఆయన మీద బేబీ లీక్స్ అనే పుస్తకాన్ని కూడా రాశాను. దాన్ని మీడియా ముందుకు తీసుకొస్తున్నాను అన్నారు. https://babyleaks2023.blogspot.com/ అనే ఆన్ లైన్లో మాధ్య‌మంలో పీడీఎఫ్ కూడా ఉందని అన్నారు.

Exit mobile version