NTV Telugu Site icon

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ కథ క్లైమాక్స్‌కి..!

Game Changer

Game Changer

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. మొన్నటివరకూ ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ, రామ్ చరణ్ పుట్టిన రోజున ‘ఫస్ట్ లుక్ పోస్టర్’తో పాటు ‘గేమ్ చేంజర్’గా టైటిల్ అనౌన్స్ అయ్యింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. భారి బడ్జట్ తో రూపొందుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్స్ ప్లే చేస్తున్నాడు. ఇందులో ఒకటి తండ్రి పాత్ర కాగా మరొకటి స్టూడెంట్ రోల్. ఈ స్టూడెంట్ రోల్ కి ఇంకో షేడ్ ఉన్నట్లు సమాచారం. సినిమాకి ప్రాణంగా నిలిచే ‘ఎన్నికల అధికారి’గా రామ్ చరణ్ కనిపించేది.. ఈ స్టూడెంట్ లీడర్ తర్వాత వచ్చే చేంజ్ ఓవర్ లోనే. వచ్చే ఏడాది సంక్రాంతిని లేదా సమ్మర్ ని టార్గెట్ చేస్తూ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి.. డైరెక్టర్ శంకర్ ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. లోకనాయకుడు కమల్ హాసన్ తో చేస్తున్న ‘ఇండియన్ 2’ లేటెస్ట్ షెడ్యూల్ ని శంకర్ కంప్లీట్ చేసాడు.

ఈ సందర్భంగా శంకర్ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసాడు. కమల్-శంకర్ ఇద్దరూ ఉన్న ఫోటోని పోస్ట్ చేసిన శంకర్… నెక్స్ట్ షెడ్యూల్ కోసం మేలో కలుద్దాం సార్! అప్పటివరకూ సెలవు అని కమల్ కి చెప్పి… మెగా ఫాన్స్ కి ట్రీట్ ఇస్తూ ‘గేమ్ చేంజర్’ క్లైమాక్స్ ని స్టార్ట్ చేయ్యనున్నట్లు ట్వీట్ చేసాడు. శంకర్ ఇండియన్ 2ని, గేమ్ చేంజర్ సినిమాని ఒక నెలలో 12 రోజులు మాత్రమే షూట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో శంకర్ అప్పుడే గేమ్ చేంజర్ సినిమా క్లైమాక్స్ షూటింగ్ అంటున్నాడు ఏంటి? అని ఫాన్స్ డైలమాలో ఉన్నారు. యాస్ పర్ షెడ్యూల్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ సెప్టెంబర్ మిడ్ వరకూ జరగాల్సి ఉంది. శంకర్ లాంటి డైరెక్టర్, వేసుకున్న షెడ్యూల్ కన్నా ముందే షూటింగ్ ని కంప్లీట్ చేస్తాడని ఆశించడం కూడా పొరపాటే అవుతుంది. ఆ బడ్జట్ కి, చరణ్ స్టార్ డమ్ కి, తన మేకింగ్ స్టాండర్డ్స్‌ కి న్యాయం చెయ్యాలి అంటే.. శంకర్ అనుకున్న టైం కన్నా కాస్త ఎక్కువ తీసుకోవడంలో తప్పే లేదు. మరి శంకర్ అప్పుడే గేమ్ చేంజర్ క్లైమాక్స్ అని ట్వీట్ చెయ్యడం వెనక రీజన్ ఏంటో చూడాలి.

Show comments