Site icon NTV Telugu

Sivaji The Boss: ‘గుండు బాస్’ కు పదిహేనేళ్లు పూర్తి.. రజినీ తో శంకర్ ఇలా

Sivaji

Sivaji

సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో టాప్ 10 మూవీస్ లో ‘శివాజీ’ ఒకటి ఉంటుంది అని అనడంలో అతిశయోక్తి లేదు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏవీఎం ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అమెరికా నుంచి వచ్చిన ఒక యువకుడు తన దేశం యొక్క పరిస్థితిని చూసి ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రజలకు అందివ్వాలనుకుంటాడు. కానీ దేశంలో ఉన్న రాజకీయ నాయకులూ లంచం కోసం అతడిని అడ్డుకొని జైలుకు పంపిస్తారు.సేవ చేయాలంటే మంచి వాళ్లకు మంచిగా, చెడ్డవాళ్లకు చెడుగానే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్న యువకుడు తాను చేయాల్సిన సేవను ఎలా చేశాడు..? అడ్డు వచ్చిన వారందరికీ ఎలా బుద్ధి చెప్పాడు అనేది శివాజీ కథ.. శివాజీ గా రజినీకాంత్ నటన వీర లెవెల్ అని చెప్పాలి. అమెరికా నుంచి వచ్చి తన దేశ దీన స్థితిని మార్చాలనుకున్న యువకుడిగా రజినీ పరకాయప్రవేశం చేసేశారు. ఇక తాను ప్రేమించిన అమ్మాయి కోసం అతడు పడే కష్టాలు ప్రేక్షకులకు నవ్వును తెప్పిస్తాయి. ముఖ్యంగా రజినీ డైలాగ్స్.. బాస్.. గుండు బాస్, నాన్న పందులే గుంపుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుంది.. లాంటి డైలాగ్స్ ఇప్పటికీ ఎవరో ఒకరు వాడుతూనే ఉన్నారు.

ఇక 2007 జూన్ 15న విడుదలైన ఈ సినిమా నేటికి 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. రజినీ డైలాగ్స్, సాంగ్స్ ను మీమ్స్ రూపం లో షేర్ చేసి హల్చల్ చేస్తున్నారు. ఇక మరోపక్క ఈ సినిమను తనకు అందించినందుకు రజినీ ఏవీఎం ప్రొడక్షన్స్ బ్యానర్ కు ఒక వాయిస్ నోట్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. మరోపక్క ఈ సినిమా దర్శకుడు శంకర్.. శివాజీ సినిమా 15 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా నేడు తన కూతురు అదితి శంకర్ తో కలిసి రజినీ కాంత్ నివాసంలో ఆయనను కలిశారు. ఈ విషయాన్ని శంకర్ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ “శివాజీ చిత్రానికి 15 సంవత్సరాలు పూర్తయిన ఈ మరపురాని రోజున ‘శివాజీ ది బాస్’ రజనీకాంత్ సార్ ని స్వయంగా కలిసినందుకు సంతోషిస్తున్నాను. మీ ఎనర్జీ ఆప్యాయత మరియు సానుకూల దృక్పధం ఈరోజును గుర్తుండి పోయేలా చేసాయి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version