NTV Telugu Site icon

‘Baby the Movie: నేను అనుభవించిన ఎనిమిది నెలల ప్రేమ నరకమే ‘బేబీ’: డైరెక్టర్ సాయి రాజేష్

Director Sai Rajesh Speech At Baby Thank You Meet

Director Sai Rajesh Speech At Baby Thank You Meet

Director Sai Rajesh Comments At Baby Thank You Meet: మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ నిర్మించిన బేబీ సినిమాకి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ఈ మూవీ జూలై 14న రిలీజ్ అయింది. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ రాగా మొదటి రోజు రికార్డ్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయిన క్రమంలో ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్ చెప్పేందుకు చిత్రయూనిట్ థాంక్యూ మీట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో సాయి రాజేష్ మాట్లాడుతూ నేను మామూలుగా చకచకా పరిగెత్తేలా స్క్రిప్ట్ రాస్తాను, కానీ ఈ బేబీ కథ రాస్తున్నప్పుడు మాత్రం ఈ కథని, పాత్రలని మెల్లిగానే చూపించాలని అనుకున్నానని అన్నారు. . ఇలా స్లో నెరేషన్‌తో సినిమా తీస్తే ఆడుతుందో లేదో అని అనుకున్నా కానీ ప్రేక్షకులు మాత్రం ప్రతీ సీన్‌ను ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. తిట్టే వాళ్ళు తిడుతున్నారు, పొగిడే వాళ్లు పొగుడుతున్నారు కానీ నేను అన్నింటినీ స్వీకరిస్తానని అన్నారు.

SKN: ఇంకో అరగంట కట్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అయ్యేది…అందుకే ప్రసాద్ ఐమాక్స్‌లో నేలను మొక్కా!

ఇరవై ఏళ్ల క్రితం నేను ప్రేమించా, ఓ ఎనిమిది నెలలు నేను నరకం అనుభవించా, ఆ బాధను తెలియజేయాలని ఈ కథ రాసుకున్నానని అన్నారు. నేను వైష్ణవి కోణంలో కథ రాయలేదు, ఆనంద్ కోణంలోంచి కథ రాసుకున్నానని పేర్కొన్న ఆయన తన తొలిప్రేమ సక్సెస్ అయింది కానీ ఆ బాధ మాత్రం నాకు తెలుసని, ఆ బాధ ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నానని అన్నారు. ఇక మున్ముందు కూడా నేను సినిమాలు నిర్మిస్తాను, దర్శకత్వం వహిస్తానని పేర్కొన్న ఆయన నెక్ట్స్ సినిమా కూడా మళ్లీ మా ఎస్కేఎన్‌ తోనే చేస్తున్నానని అన్నారు. ఈ మూడు పాత్రలు రాయడానికి నేను ఎంతో స్ట్రగుల్ అయ్యానని, ఎవరి కోణంలో ఆలోచించి రాయాలి? ఎలా తీయాలని ఎంతో మధనపడ్డానని అన్నారు. ఇక టైటిల్‌ విషయంలోనూ ఎంతో ఆలోచించానని పేర్కొన్న ఆయన నా సినిమాలకు క్యాచీ టైటిల్ ఉండాలని భావిస్తా, అలాంటి క్రమంలో బేబీ అని పెట్టాలని అనుకున్నాను, దానికి తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో మార్పులు కూడా చేశానని అన్నారు.. ప్రేమ వల్లే వచ్చే సంతోషం కన్నా బాధే చాలా ప్రభావం చూపిస్తుంది, గట్టిగా ఉంటుంది, ప్రేమంటే నిర్వచించడం కష్టం అని అన్నారు. ప్రేమ వల్ల ఎందుకు బాధ వస్తుందంటే చెప్పలేమని, బూతులు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి నేను ఇలా ‘’రా’’గా ఉండాలనే తీశానని అయితే సెన్సార్ వల్ల ఇంకా చాలా కట్ అయ్యాయని అన్నారు. కానీ నాకు ఇది తప్పలేదని, అలాంటి పదాలు పెట్టినందుకు ఓ పది టికెట్లు తెగుతాయని మాత్రం కాదని అన్నారు.