NTV Telugu Site icon

Rajamouli: రాజమౌళికి పాకిస్థాన్ వాళ్లు పర్మిషన్ ఇవ్వలేదట…

Rajamouli

Rajamouli

ఇండియన్ సినిమా గ్లోరిని ప్రపంచవ్యాప్త సిని అభిమానులకి తెలిసేలా చేసిన ఘనత దర్శక ధీరుడు రాజమౌళి. ఈరోజు వరల్డ్ ఆడియన్స్ మాత్రమే కాకుండా జేమ్స్ కెమరూన్, స్టీఫెన్ స్పీల్ బర్గ్ లాంటి దర్శకులు కూడా ఇండియన్ సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే రాజమౌళి వల్లే సాధ్యం అయ్యింది. ఒక ఇండియన్ సినిమా వెళ్లలేదు అనుకున్న ప్రతి చోటుకి మన సినిమాని తీసుకోని వెళ్లి, ఆస్కార్ ని కూడా ఇండియాకి తీసుకోని వచ్చిన రాజమౌళికి పాకిస్థాన్ లో చెడు అనుభవం ఎదురయ్యిందట. అసలు రాజమౌళి పాకిస్థాన్ ఎందుకు వెళ్లాడు? తనకి ఎదురైన చెడు అనుభవం ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే… సోషల్ మీడియాలో ఆనంద్ మహీంద్రా చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో చూసే విషయాలని, షేర్ చేస్తూ తన అభిప్రాయాన్ని చెప్తూ ఉంటారు. అలానే ‘దేశి థగ్’ అనే ట్విట్టర్ హ్యాండిల్ ‘ఇండస్ వ్యాలీ సివిలైజేషన్’ గురించి కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసాడు. హరప్పా, మొహంజోదారో లాంటి ప్రాంతాల్లో సివిలైజేసన్ ఎలా ఉండేది అని ఊహించి డిజైన్ చేసిన ఫొటోస్ ని ‘దేశి థగ్’ హ్యాండిల్ ట్వీట్ చేసింది. వీటిని చూడగానే ఆనంద్ మహీంద్రా, “ఈ ఇల్లస్ట్రేషన్స్ మన చరిత్రని, మన ఊహాశక్తిని ప్రేరేపించేలా ఉన్నాయి” అని ట్వీట్ చేస్తూ రాజమౌళిని టాగ్ చేసి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పైన రాజమౌళి ఒక సినిమా చేస్తే బాగుంటుందని, అది మన సివిలైజేషన్ గురించి గ్లోబల్ అవేర్నెస్ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసాడు.

తనని ఆనంద్ మహీంద్రా ట్యాగ్ చెయ్యడంతో రాజమౌళి రెస్పాండ్ అయ్యారు. “అవును సర్… నేను మగధీర షూటింగ్ సమయంలో ‘ధోలావీరా’కి వెళ్లాము. అక్కడ ఒక పురాతనమైన చెట్టును చూశాను. అది శిలాజంగా మారిపోయి ఉంది. ఆ చెట్టు పాయింట్ ఆఫ్ వ్యూలో సింధు నాగరికత ఎలా మొదలయ్యింది, ఎలా పతనం అయ్యింది అనే సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. కొన్ని సంవత్సరాల తర్వాత నేను పాకిస్థాన్ వెళ్లాను కానీ మొహంజోదారోకి ఎంత ప్రయత్నించినా పర్మిషన్ ఇవ్వలేదు” అంటూ రిప్లై ఇచ్చాడు. రాజమౌళి రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పుడు మీరు వేరు, ఇప్పుడు మీ రేంజ్ వేరు రాజమౌళి సర్, ఇప్పుడు ట్రై చెయ్యండి అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే సింధు నాగరికత బ్యాక్ డ్రాప్ లో హృతిక్ రోషన్ ఇప్పటికే ఒక సినిమా చేసాడు. మొహంజోదారో అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

 

Show comments