NTV Telugu Site icon

K Raghavendra rao: సింగర్ సునీత కొడుకు కోసం రాఘవేంద్రరావు ‘సర్కారు నౌకరి’!

Sunitha

Sunitha

‘Sarkaru Noukari’: ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. విశేషం ఏమంటే… సునీత కొడుకును హీరో చేయడం కోసం దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఆర్.కె. టెలీ షో పతాకంపై ఓ సినిమా నిర్మిస్తున్నారు. దీని ద్వారా గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘సర్కారు నౌకరి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలను సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

గాయని సునీత తనయుడు ఆకాశ్ సరసన నూతన నటి భావనా వళపండల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవంలో జీ స్టూడియోస్ నిర్మాత ప్రసాద్ నిమ్మకాయల కెమెరా స్విచ్చాన్ చేయగా, మ్యాంగో మీడియా అధినేత, గాయని సునీత భర్త రామ్ వీరపనేని గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దేవుడి పటాలపై క్లాప్ నిచ్చారు. అనంతరం హీరోహీరోయిన్లపై తీసిన తొలిషాట్ కు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా గాయని సునీత కెమెరా స్విచ్చాన్ చేశారు. ఫిబ్రవరి 6 నుంచి నిరవధికంగా షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు.