NTV Telugu Site icon

Ustaad: భగత్ సింగ్ ని కాదు భగవంతుడిని…

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh

‘నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది’, ‘నేను ఆకాశం లాంటోడిని’, ‘పాపులారిటీ ఏముందిలే అది పాసింగ్ క్లౌడ్ లాటింది’, ‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను, సెట్ చేస్తా’, ‘నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ’, ‘అరే సాంబ రాస్కో రా’… ఇవి శాంపిల్ మాత్రమే ఇలాంటి డైలాగులని గబ్బర్ సింగ్ సినిమాలో దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ తో బుల్లెట్స్ లా మాటాడించాడు. ఈ వన్ లైనర్స్ ని పవన్ చెప్తుంటే, ఆ యాటిట్యూడ్ కి ఆ స్వాగ్ కి ఫాన్స్ ఫిదా అయ్యారు. థియేటర్స్ లో ప్రతి డైలాగ్ విజిల్స్ వేయించింది, గత దశాబ్దమున్నర కాలంలో ఈ రేంజ్ ఫ్యాన్ స్టఫ్ ఇచ్చిన సినిమా ఇంకొకటి రాలేదు. అందుకే హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కోసం పవర్ స్టార్ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేసారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే రిలీజ్ అయిన గ్లిమ్ప్స్… పవన్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేసింది.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఉన్న నెగిటివిటీ మొత్తాన్ని ఒక్క గ్లిమ్ప్స్ తో తీసేసిన హరీష్ శంకర్, ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అని చెప్పేసాడు. ఈ సినిమాలో కూడా పవన్ కోసం హరీష్ స్పెషల్ వన్ లైనర్స్ రాస్తున్నాడట. ప్రస్తుతం సోషల్ మీడియాలో  ఓ డైలాగ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనేదే.. అంటూ తెగ వైరల్ అవుతోంది. “నువ్వేమన్నా గాంధీవా? లేక భగత్ సింగ్‌వా? అంటే.. ‘గాంధీ, భగత్ సింగ్ కాదురా.. అంతకు మించి భగవంతుడిని’ అని పవన్ చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుందని అంటున్నారు. ఈ డైలాగ్ వినడానికి బాగానే ఉంది, పవన్ చెప్తే ఇంకా బాగుంటుంది కానీ అసలుఈ డైలాగ్ సినిమాలో ఉంటుందా లేదా అనేది చూడాలి.

Show comments