NTV Telugu Site icon

Mallareddy: పవన్ కళ్యాణ్ కి విలన్ గా చెయ్యమని హరీష్ శంకర్ అడిగితే నే ఓకే చెప్పలే

Mallareddy

Mallareddy

తెలంగాణాలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా, రాష్ట్రంలో ఫేమస్ పర్సనాలిటీ ఎవరు చేశారు అంటే ప్రతి ఒక్కరి నుంచి వినిపించే పేరు ‘మల్లారెడ్డి’. “పాలమ్మినా, పూలమ్మినా, కష్టపడినా” అంటూ డైలాగు చెప్పి మరీ మల్లారెడ్డి పేరుని చెప్తారు తెలంగాణా యూత్. అంతలా ఫేమస్ అయిన తెలంగాణా మినిస్టర్ మల్లారెడ్డి, ‘మేమ్ ఫేమస్’ అనే సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కి ఛీఫ్ గెస్టుగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో తన స్టైల్ లో మాట్లాడిన మల్లారెడ్డి “దర్శకుడు హరీష్ శంకర్ నా ఇంటికి వచ్చి నన్ను గంట, గంటన్నర సేపు రిక్వెస్ట్ చేశాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ కి విలన్ గా నటించమని అడిగాడు కానీ నేను విలన్ గా చెయ్యనని” చెప్పాను అంటూ మాట్లాడారు. ప్రస్తుతం మల్లారెడ్డి స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ తమిళ్ లో విజయ్ నటించిన ‘తెరి’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుందనే టాక్ వినిపిస్తోంది. తెరి సినిమాలో విలన్ పాత్రలో ‘జే అలెగ్జాండర్ అలియాస్ మహేంద్రన్’ ప్లే చేశాడు. మహేంద్రన్-విజయ్ మధ్య ఒక సూపర్బ్ సీన్ కూడా ఉంటుంది. హీరోకి టఫ్ ఫైట్ ఇచ్చేలా ఉండే ఈ పాత్ర కోసమే హరీష్ శంకర్, మల్లారెడ్డిని అప్రోచ్ అయినట్లు ఉన్నాడు. మరి ఇప్పుడు మల్లారెడ్డిని అనుకున్న విలన్ పాత్రలో హరీష్ శంకర్ ఎవరినీ దించుతాడో చూడాలి. ఇదిలా ఉంటే ఏప్రిల్ 5 నుంచి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి డేట్స్ కేటాయించాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 5 నుంచి జరగనుంది మరి గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ లు ఏ రేంజులో రిపీట్ చేస్తారో చూడాలి.

Show comments