Diljit Dosanjh: ‘మిర్జాపూర్ ది మూవీ’లోని ‘సాన్సోం కి మాలా పే’ పాట ఇప్పుడు సినిమా పరిధిని దాటి అంతర్జాతీయ వేదికపై కూడా సందడి చేస్తోంది. లండన్‌లోని ప్రతిష్టాత్మక వెంబ్లీ స్టేడియంలో పంజాబీ స్టార్ సింగర్ దిల్జిత్ దోసాంజ్ ఈ క్లాసిక్ పాటను తన లైవ్ పెర్ఫార్మెన్స్‌లో ఆలపించడంతో అభిమానులు ఒక్కసారిగా ఫిదా అయ్యారు. ఆయన పాట పాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, వెంబ్లీ స్టేడియం మొత్తం ఫోన్ లైట్లతో మెరిసిపోయిన దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 2026న సెప్టెంబర్ 12 దిల్జిత్ దోసాంజ్ తన ‘Aura World Tour’లో భాగంగా లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో భారీ కాన్సర్ట్ నిర్వహించారు.
ఈ ప్రదర్శన ప్రత్యేకత ఏంటంటే, వెంబ్లీ స్టేడియంలో హెడ్‌లైన్ చేసిన తొలి పంజాబీ ఆర్టిస్ట్‌గా దిల్జిత్ నిలిచారు. సుమారు 90 వేల మంది సామర్థ్యం ఉన్న ఈ ప్రతిష్టాత్మక వేదికలో ఆయన షో సోల్డ్ అవుట్ కావడం కూడా ఆయనకు ఉన్న గ్లోబల్ క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది. ఈ కాన్సర్ట్‌లో దిల్జిత్ తన పాపులర్ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించడంతో పాటు లెజెండరీ నుస్రత్ ఫతే అలీ ఖాన్‌కు చెందిన ‘సాన్సోం కి మాలా పే’కు కూడా తనదైన శైలిలో నివాళి అర్పించారు. ఈ పాట మొదలైన సమయంలో స్టేడియంలో ఉన్న అభిమానులు ఫోన్ ఫ్లాష్‌లను ఆన్ చేయడంతో అక్కడి వాతావరణం మరింత అద్భుతంగా మారింది. వేలాది ఫోన్ లైట్ల మధ్య దిల్జిత్ పాటకు ప్రేక్షకులు స్పందించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే వెంబ్లీ స్టేడియంలో దిల్జిత్ సాధించిన ఘనతను మైకేల్ జాక్సన్ 1988 రికార్డుతో పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. అదే స్టేజ్ షోకు సుమారు 72 వేల మంది అప్పట్లో హాజరయ్యారు. అయితే రికార్డుల సంగతి పక్కన పెడితే, వెంబ్లీ వంటి ప్రపంచ ప్రఖ్యాత వేదికపై దిల్జిత్ పంజాబీ సంగీతానికి తీసుకొచ్చిన గుర్తింపు మాత్రం ప్రత్యేకమైనదే. ఒక పాకిస్తానీ సంగీత దిగ్గజం క్లాసిక్‌కు భారతీయ పంజాబీ స్టార్ అంతర్జాతీయ వేదికపై నివాళి ఇవ్వడం, అదే సమయంలో ‘మిర్జాపూర్ ది మూవీ’ ద్వారా ఆ పాట కొత్త తరం ప్రేక్షకుల్లోకి వెళ్లడం ఇప్పుడు సంగీత అభిమానుల మధ్య ఆసక్తికరమైన చర్చగా మారింది. దీంతో సినిమా పాటకు వచ్చిన క్రేజ్ ఇప్పుడు థియేటర్లను దాటి గ్లోబల్ స్టేజ్ వరకు వెళ్లిందని అభిమానులు సంబరపడుతున్నారు.
Diljit Dosanjh. Sold-out Wembley Stadium. Punjabi music on this scale. 🥹@diljitdosanjh brought his Aura World Tour to London on 12 September, headlining the UK’s biggest stadium.
To put the venue’s musical history into perspective: Michael Jackson played seven sold-out shows… pic.twitter.com/M38B1RUpP6
— UB1UB2 West London (Southall) (@UB1UB2) September 12, 2026

