NTV Telugu Site icon

Dil Raju: సంక్రాంతికి వెనక్కి తగ్గేది వారే.. దిల్ రాజు ఓపెన్ కామెంట్స్!

Dil Raju

Dil Raju

Dil Raju Comments about Sankranthi 2024 Movie Releases: సంక్రాంతి వచ్చింది అంటే కొత్త సినిమాలతోనే పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి మన తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు. అందుకే సంక్రాంతి సీజన్లో తమ సినిమాలు రిలీజ్ చేసుకోవాలని మేకర్స్ కూడా ముందుకు ముందే కర్చీఫ్ లు వేసుకుంటూ ఉంటారు. సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయినా టాక్ తో సంబంధం లేకుండా ఆ 3 రోజులు అసాధారణమైన కలెక్షన్స్ ను వచ్చేస్తాయి. అయితే ఈ 2024 సంక్రాంతికి మాత్రం ఏకంగా 6 కి పైగా సినిమాలు రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటనలు వచ్చేశాయి. మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ల ‘గుంటూరు కారం’ , వెంకటేష్ ‘సైంధవ్‌’ , రవితేజ ‘ఈగిల్‌’,‘హను – మాన్‌’ , నాగార్జున ‘నా సామి రంగ’… ఇవి చాలవు అన్నట్టు 2-3 తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటనలు వచ్చాయి. ఇన్ని సినిమాలకి థియేటర్స్ అడ్జస్ట్ చేయడం అనేది డిస్ట్రిబ్యూటర్లకి కూడా పెద్ద టాస్క్.

Salaar Child Artist: పృథ్వీరాజ్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసింది రవితేజ కొడుకా.. అసలు విషయం ఇదే!

ఈ విషయంలో ఎందుకో ‘గిల్డ్’ ఇప్పటివరకు సైలెంట్ గా ఉంటూ వచ్చింది కానీ కొద్దిరోజుల క్రితం దిల్ రాజు సంక్రాంతికి రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసిన దర్శకనిర్మాతలతో ఓ చిన్న మీటింగ్ ఏర్పాటు కూడా చేశారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడలేదు. అయితే ఈ రోజు వేరే కార్యక్రమంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన దిల్ రాజు ఈ విషయం మీద స్పందించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా జరిగిన విషయాలు చెబుతున్నా అని ముందు మంత్రి కోమటిరెడ్డిని కలిశామని అన్నారు. త్వరలో రేవంత్ రెడ్డి గారిని ఆయన కల్పించబోతున్నారు అని అన్నారు. ఈ సంక్రాంతి సినిమాల గురించి మొన్న ఛాంబర్ లో మీటింగ్ జరిగిందని, ఆరోజు ఐదుగురు నిర్మాతలను పిలిచి ఒకరిద్దరు వెనక్కి వెళితే మిగతా వాళ్ళకి ఈజీగా థియేటర్లు దొరుకుతాయి అని చెప్పినట్టు వెల్లడించారు. అందరు నిర్మాతలకు చెప్పమని, రేపు ఎల్లుండి లోపల ఎవరైనా నిర్మాతలు వెనక్కి వెళతాం అనుకుంటే చాంబర్ తరపున వారికి సోలో డేట్ ఇప్పిస్తామని అన్నారు. “పెద్ద సినిమాకి పెద్ద న్యాయం జరుగుతుంది చిన్న సినిమాకి చిన్న న్యాయం జరుగుతుంది అందరికీ న్యాయం ఎప్పటికి జరగదని ఆయన అన్నారు.

Show comments