NTV Telugu Site icon

Satya Dev: ‘గాడ్ ఫాదర్’ లో సత్య దేవ్ ఆ పాడు పని చేశాడా..?

Satya

Satya

Satya Dev: మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5 న రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమాపై అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. ఇక ఈ సినిమాను తెలుగు నేటివిటీ ప్రకారం తెరకెక్కించినట్లు తెలుస్తోంది.. దీనికోసం కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. కాగా, ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా నయన్ నటిస్తుండగా.. నయన్ కు భర్తగా, విలన్ గా హీరో సత్యదేవ్ కనిపించనున్నాడు. చిరుకు ధీటుగా సత్యదేవ్ ఎలాంటి విలనిజాన్ని పండిస్తాడో చూడాలి. అయితే ఈ సినిమాలో సత్య దేవ్ పాత్రను ఒరిజినల్ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించాడు.

ఇక ఈ పాత్ర ఎంత క్రూయల్ అంటే.. తాను పెళ్లి చేసుకున్న రెండో భార్య కూతురికి డ్రగ్స్ ఇచ్చి, ఆమెను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు వివేక్. అందరి ముందు తండ్రిలా ప్రేమను కురిపిస్తూనే ఆమెను అసభ్యంగా తాకుతూ క్రూరంగా ప్రవరిస్తాడు. ఈ విషయం తెలియడంతోనే అతని భార్య మంజు వారియర్.. అతడిని చంపేయమని మోహన్ లాల్ కు చెప్తుంది. ఇక ఆ పాత్రకు వివేక్ ప్రాణం పోశాడనే చెప్పాలి. ఇక అదే పాత్రలో సత్య దేవ్ ఇలాంటి పాడుపని తెలుగులో చేస్తాడా..? లేదా అనేది పలువురు వ్యక్తం చేస్తున్న అనుమానం. తెలుగు నేటివిటీకి తగట్టు కథలో మార్పులు చేస్తే ఈ సీన్స్ ను తీసేసి ఉంటారని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మరికొందరు అయితే.. నయన్ కు అస్సలు పాపనే తీసేసి ఉంటారని, పెళ్ళైన తరువాత కథగా చూపించి ఉంటారని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి సీన్స్ లో తెలుగులో చాలా తక్కువగా కనిపిస్తాయి.. అందులోను ఒక హీరోగా చేస్తున్న సత్యదేవ్ ఇలాంటి పాత్ర చేస్తే తరువాత అతడిపై నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుందని చెప్పుకొస్తున్నారు. మరి సినిమా చూస్తే కానీ ఇందులో ఉన్న మార్పులు చేర్పులు ఏంటో చెప్పలేమంటున్నారు అభిమానులు. ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments