కోలీవుడ్ నటుడు, దర్శకుడు ధనుష్ డిజిటల్ ప్రపంచంలో తన ఇమేజ్ ను మరింత స్ట్రాంగ్ గా చేయడానికి అడుగులు వేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజకీయ పార్టీలు నిర్వహించే ప్రచార విభాగాలు, డిజిటల్ టీమ్స్ తరహాలోనే ఆయన కూడా ఒక ప్రత్యేకమైన ‘IT Wing’ (డిజిటల్ టీమ్)ను ఏర్పాటు చేస్తున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ప్రత్యేక సోషల్ మీడియా వింగ్ ఏర్పాటు మరియు దాని నిర్వహణ కోసం ధనుష్ దాదాపు కోటి రూపాయలు వరకు వెచ్చిస్తున్నట్లు ఫిలిం నగర్ సమాచారం. తన సినిమాల ప్రమోషన్లను సమర్థవంతంగా నిర్వహించడం, ఆన్‌లైన్ ట్రోలింగ్‌ను అడ్డుకోవడం, తన బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పటిష్టం చేయడం ఈ టీమ్ ప్రధాన బాధ్యతలుగా ఉండనున్నాయని భావిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో సినీ తారల ప్రవేశం కొత్తేమీ కాదు. ఇటీవల కాలంలో విజయ్ ఇలానే ఐటీ వింగ్ ను ఏర్పాటు చేసుకుని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి సీఎంగా ఎన్నికయ్యారు. దాంతో తమిళ సినీ స్టార్స్ కు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో ధనుష్ కూడా ఇలా రాజకీయ పార్టీల తరహాలో ‘IT Wing’ సెటప్ చేస్తుండటం ఆయన రాజకీయ భవిష్యత్తుపై కొత్త చర్చకు తెరలేపింది. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా లేదా కేవలం తన పాన్-ఇండియా సినీ కెరీర్‌ను మేనేజ్ చేయడానికే ఈ డిజిటల్ వ్యూహమా అనేది వేచి చూడాలి.

