Site icon NTV Telugu

Kara: ఏప్రిల్ 30న తెలుగులో ధనుష్ ‘కర’ రిలీజ్

Kara

Kara

ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ధనుష్, మమితా బైజు మిడిల్ క్లాస్ జంటగా కనిపించబోతోన్నారనిపిస్తోంది.

Also Read :TFDA : తెలుగు చిత్రసీమలో సరికొత్త సంచలనం.. దర్శకుల కోసం చదలవాడ శ్రీనివాసరావు బంపర్ ఆఫర్

భార్యాభర్తలుగా వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘కర’ సినిమాని విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్ మీద సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందించారు. విఘ్నేశ్ రాజా, ఆల్‌ఫ్రెడ్ ప్రకాష్ సంయుక్తంగా ఈ కథను రచించారు. థేనీ ఈశ్వర్ ఈ సినిమాకి కెమెరామెన్‌గా, శ్రీజిత్ సారంగ్ ఎడిటర్‌గా పని చేశారు. ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. త్వరలోనే ప్రమోషన్స్‌తో మేకర్స్ సందడి చేయనున్నారు.

Exit mobile version