Site icon NTV Telugu

Dhanush New Home : కోట్లలో ఖర్చు చేస్తున్న హీరో

Dhanush

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు తెలుగు సినిమాపై దృష్టి సారించాడు. ఇటీవలే భార్య ఐశ్వర్య రజనీకాంత్ తో విడాకుల విషయం ప్రకటించి సంచలనం సృష్టించిన ధనుష్ మళ్ళీ మనసు మార్చుకుని, ఇద్దరూ కొంతకాలం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ధనుష్ హైదరాబాద్‌లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సర్’ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆగస్ట్ 2022న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ధనుష్ చెన్నైలోని తన కొత్త ఇంటి కోసం రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే 300 కోట్ల రూపాయల ఇంటిని సొంతం చేసుకున్న తొలి దక్షిణాది నటుడు ధనుష్ అవుతాడు.

Read Also : Janhvi Kapoor in NTR 31 : క్లారిటీ ఇచ్చేసిన బోనీ కపూర్

ఒక్కో సినిమాకు 50 కోట్లు తీసుకుంటున్న ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమాకి సైన్ కూడా చేశాడు. ధనుష్ తన రెండు తెలుగు ప్రాజెక్ట్‌లకు 100 కోట్లు తీసుకుంటున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు ఈ ఏడాది పూర్తవుతాయని భావిస్తున్నారు. అప్‌డేట్ ప్రకారం ధనుష్ తన సంపాదన మొత్తాన్ని కొత్త ఇంటి కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ధనుష్ ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాలును లైన్లో పెట్టారు.

https://www.youtube.com/watch?v=v97rAjyN_hQ
Exit mobile version