మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబోలో తొలిసారి ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘ధమాకా’ కొత్త యాక్షన్ షెడ్యూల్ తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రవితేజ, ఫైటర్స్‌పై భారీ సెట్‌లో టీమ్ ఉత్కంఠభరితమైన యాక్షన్ సీక్వెన్స్‌ను రూపొందిస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్‌ని రామ్-లక్ష్మణ్ మాస్టర్లు పర్యవేక్షిస్తున్నారు.
Read Also : RC15 video leaked : షూటింగ్ లో చెర్రీ అలా…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌ల నుండి వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉండగా, నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ‘పెళ్లి సందడి’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల ఈ సినిమాలో రవితేజ సరసన కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇక ఇటీవలే ‘ఖిలాడీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
