NTV Telugu Site icon

Devara: కొద్దిమంది సమక్షంలో ఘనంగా జరిగిన దేవర సక్సెస్‌ సెలబ్రేషన్స్‌

New Project (52)

New Project (52)

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఈ సినిమా ఫస్ట్ షో నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. కానీ కలెక్షన్లు మాత్రం భారీగానే ఉన్నాయి. అంతే కాకుండా తాజాగా దేవర రూ. 350 కోట్ల క్లబ్‌లో చేరినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఓవరాల్ గా ‘దేవర’ కలెక్షన్ల పరంగా ఎన్టీఆర్ సునామీ సృష్టిస్తాడని చెప్పొచ్చు.

Read Also:Fastag Recharge Rules Change: ఫాస్టాగ్ రీఛార్జ్ నియమాలలో మార్పు.. గమనించారా?

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబో ఇది రెండో చిత్రం. ఇంతకు ముందు ఈ కాంబినేషన్‌లో జనతా గ్యారేజీ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే దేవర సినిమాకు దసరా సెలవులు ఈ చిత్రానికి బిగ్గెస్ట్‌ అడ్వాంటేజీగా మారనున్నాయి. రానున్న రోజుల్లో పెద్ద చిత్రమేమీ లేకపోవడంతో దసరా సెలవుల్లో దేవరదే హవా అని డిసైడ్‌ అయిపోవచ్చు. ఇదిలా వుండగా ఈ సినిమా రిలీజ్‌కు రెండు రోజుల ముందు ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. తిరిగి ఆయన బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. వాస్తవంగా గురువారం రోజు ఈ చిత్రం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ వేడుక గుంటూరులో అభిమానుల మధ్య జరగాల్సి ఉంది. అయితే అనుకోని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది. దేవి నవరాత్రుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సక్సెస్‌మీట్‌కు పోలీసులు అనుమతించలేదు.

Read Also:Agricultural Development: లక్ష కోట్లతో వ్యవసాయ అభివృద్ధి పథకాలకు ఆమోదం!

ఈ విషయమై దేవర డిస్ట్రిబ్యూటర్, నిర్మాత నాగవంశీ అభిమానులను క్షమాపణలు కూడా కోరిన సంగతి తెలిసిందే. కాగా దేవర సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ టాలీవుడ్‌ ప్రముఖుల సమక్షంలో గురువారం హైదరాబాద్‌లోని ఓ స్టార్‌ హోటల్ లో ఘనంగా జరిగాయి. అభిమానులకు, మీడియాకు దూరంగా జరిగిన ఈ వేడుకకు హీరో ఎన్టీఆర్‌తో పాటు చిత్రంలో నటించిన ఇతర నటీనటులు, సంచలన దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళితో పాటు నిర్మాతలు దిల్‌రాజు, నందమూరి కళ్యాణ్‌రామ్‌, దానయ్య, నాగవంశీ, దేవర డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే పాల్గొన్నారు.

Show comments