Site icon NTV Telugu

Devara : దేవరకు సలాం అంటున్న ప్రపంచం.. సాహో ఎన్టీఆర్

New Project 2024 12 29t141034.061

New Project 2024 12 29t141034.061

Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. రిలీజ్ అయిన ప్రతీ చోట మొదట నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నా కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా దసరా కానుకగా రిలీజ్ కాబడిన సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Read Also:Harish Rao: బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతుంది..

దేవర డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. అక్కడ కూడా దేవర దండయాత్ర చేశారు. ఓటీటీలో కూడా ట్రెండింగులో నిలిచింది. ఈ నేపథ్యంలో దేవర సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. దేవర సినిమాలో ఎన్టీఆర్ నటనకు అభిమానులు పట్టం కట్టారు.

Read Also:Venkatesh : స్టేజీ మీద స్టెప్పులు ఇరగదీసిన వెంకీ.. పక్కన గ్లామర్ అదుర్స్

ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన దగ్గర్నుండి సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇప్పటికీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ అవుతుండడం విశేషం. ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో నాన్-ఇంగ్లీష్ చిత్రాల్లో టాప్ 10లో 4వ స్థానంలో ట్రెండింగ్ అవుతుండడం విశేషం. ఈ సినిమాకు గ్లోబల్ స్థాయిలో ఆడియెన్స్ ఎంతలా ఇంప్రెస్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు.

Exit mobile version